Saturday, 18 May 2024 01:00:11 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కామారెడ్డి కాంగ్రెస్‌లో గందరగోళం.. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న అసంతృప్త నేతలు

Date : 29 October 2023 09:37 AM Views : 85

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ.. కాంగ్రెస్‌లో రోజురోజుకూ రెబల్స్ బెడద ఎక్కువ అవుతోంది. టికెట్ దక్కని నేతల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. మరికొంత మంది పార్టీని వీడుతున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టికెట్ దక్కకపోవడంతో బోరున విలపించిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ కో ఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి.. పార్టీకి రాజీనామా చేశారు. రెబల్‌గా పోటీ చేస్తానని ప్రకటించడమే కాకుండా.. తనను మోసం చేసిన రేవంత్‌ను సైతం ఓడిస్తానని శపథం చేశారాయన. ఎల్లారెడ్డిలో కె.మదన్‌ మోహన్‌రావుకు టికెట్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది సుభాష్‌రెడ్డి వర్గం. ఇక జుక్కల్‌లో మాజీ ఎమ్మెల్యే గంగారాం తన అనుచరులతో ఇవాళ సమావేశం కాబోతున్నారు. జుక్కల్ టికెట్ పెండింగ్‌లో పెట్టడంపై ఆయన అసంతృప్తిలో ఉన్నారు. దీనిపై అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇక బాన్సువాడ టికెట్ కోసం రెండు వర్గాలు పోటీపడటంతో పెండింగ్‌లో పెట్టింది అధిష్టానం. దీంతో రెండు వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుః కేటీఆర్ మరోవైపు అధికార పార్టీ బీఆర్ఎస్ అన్ని వర్గాలను కలుపుపోయే పనిలో పడింది. అసమ్మతి నేతలకు బుజ్జగింపులతో పాటు స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే. తారక రామారావు. తననున కలిసిన కామారెడ్డి రైతు జేఏసీ బృందం కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ ని రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్. మరోసారి డిటిసిపి అధికారులతో మాట్లాడిన కేటీఆర్.. ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కేటీఆర్.. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. కేటీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల రైతు జేఏసీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే రైతు జేఏసీ నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను కూడా సానుకూలంగా పరిశీలించి ఎత్తేసే చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :