Saturday, 18 May 2024 11:37:51 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

కొత్తగా మరో రెండు నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

Date : 29 December 2022 08:46 AM Views : 195

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వరుస నోటిఫికేషన్‌లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్స్‌ మొదలు ప్రభుత్వ విభాగాల్లో ఉన్న పలు ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ వచ్చిన టీఎస్‌పీఎస్సీ తాజాగా మరో రెండు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి ద్వారా మొత్తం 276 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చే నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇంతకీ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. రెండు నోటిఫికేషన్స్‌లో భాగంగా విద్యా శాఖ, వ్యవసాయ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెక్నికల్​ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్‌లో 37 పీడీ పోస్టులు, ఇంటర్మీడియట్‌​ డిపార్ట్​మెంట్‌‌లో 91 పీడీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వచ్చేనెల 6వ తేదీని నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మరో నోటిఫికేషన్‌లో భాగంగా వ్యవసాయ శాఖలో అగ్రిల్చర్​ ఆఫీసర్​ పోస్టులను భర్తీ చేయనున్నారు. మల్టీజోన్​ –1 లో 100, మల్టీజోన్​ –2లో 48 ఖాళీలు ఉన్నాయి. వచ్చేనెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటికి సంబంధించిన వివరాలన్నీ టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ సెక్రెటరీ అనితా రామచంద్రన్​ తెలిపారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :