Saturday, 18 May 2024 11:57:38 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

సీఎం కేసీఆర్ ఎప్పటిలోగా కోలుకుంటారు..? పార్టీ వర్గాలు ఏమని చెబుతున్నాయి

Date : 07 October 2023 02:39 PM Views : 75

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఎన్నికలు దగ్గరపడిన వేళ పది రోజులుగా కేసీఆర్ ఎలాంటి కార్యక్రమాలు చేయకపోవడం, ఇంత పొలిటికల్ హడావుడి ఈ స్థాయిలో ఉన్న ఆయన మాత్రం బయటకు రాకపోవడం కొంతమేరకు BRS కార్యకర్తలలో ఆందోళన కలిగించింది. కానీ ప్రగతి భవన్ నుంచి వస్తున్న సమాచారం సమాచారం ప్రకారం ఆయన సీజనల్ ఫీవర్‌తో ఇబ్బంది పడ్డారు. సీఎం కేసీఆర్ ఎప్పటిలోగా కోలుకుంటారు..? పార్టీ వర్గాలు ఏమని చెబుతున్నాయి గత పది రోజులుగా కేసీఆర్ ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన హెల్త్ పెద్దగా బాగోలేదని.. అందుకే బయటకే రావడం లేదంటూ అనేక రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంకొంతమంది అయితే ప్రగతిభవన్లో ఆసుపత్రి, మెడికల్ రూమ్ సెటప్ చేశారని కూడా మాట్లాడుకుంటున్నారు. అటు ప్రగతి భవన్ నుంచి కూడా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు ప్రజలంతా కేసిఆర్ ఆరోగ్యం పైన అప్డేట్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్న పరిస్థితి. దీనికి చెక్ పెట్టేందుకు శుక్రవారం కేటీఆర్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ వైరల్ ఫీవర్ తగ్గిన వెంటనే చెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిందని.. ఒకటి, రెండు రోజుల్లో కోలుకుంటారని చెప్పారు. నిజానికి కేసీఆర్‌కి గతం నుంచి కూడా దీర్ఘకాలిక వ్యాధులు లేవు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిరాహార దీక్ష చేసినప్పుడు తప్ప ఎప్పుడు ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయింది కూడా లేదు. నేను చాలా హెల్ది అంటూ ఆయన చాలాసార్లు ప్రెస్ మీట్స్‌లో కూడా చెప్పుకొచ్చారు. కానీ ఎన్నికలు దగ్గరపడిన వేళ పది రోజులుగా కేసీఆర్ ఎలాంటి కార్యక్రమాలు చేయకపోవడం, పొలిటికల్ హడావుడి ఈ స్థాయిలో ఉన్న ఆయన మాత్రం బయటకు రాకపోవడం కొంతమేరకు BRS కార్యకర్తలలో ఆందోళన కలిగించింది. కానీ ప్రగతి భవన్ నుంచి వస్తున్న సమాచారం సమాచారం ప్రకారం ఆయన సీజనల్ ఫీవర్‌తో ఇబ్బంది పడ్డారు. వయసు పెద్దది కావడంతో కొంత చెస్ట్ ఇన్ఫెక్షన్ కూడా ఉన్నట్లు చెప్తున్నారు. డీహైడ్రేషన్ కూడా ఉండడంతో పూర్తి రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తుంది. రోజూ ఉదయం సాయంత్రం డాక్టర్లు విజిట్ చేయడంతో పాటు.. బ్లడ్ టెస్ట్‌లు మాత్రమే ఆయనకు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా కోలుకున్న కేసీఆర్ కొంతమంది ముఖ్య నేతలతో భేటీలు కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ప్రగతిభవన్లో ఎలాంటి ఆసుపత్రి సెటప్ కానీ మెడికల్ రూమ్ కానీ ఏర్పాటు చేయలేదు. నిజానికి కేసీఆర్ ఆరోగ్యం ఏ మాత్రం బాగా లేకున్నా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఇందులో ఎలాంటి దాపరికాలు ఉండవని పార్టీ సీనియర్లు చెప్తున్నారు. త్వరలోనే ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు.. అటు పార్టీ కార్యక్రమాల్లో సీఎం యాక్టివ్ అవుతారని BRS నేతలు చెబుతున్నారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :