Saturday, 18 May 2024 09:22:33 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

జంపింగ్స్ సీజన్.. జోరుగా సాగుతున్న పార్టీ మార్పిళ్లు

Date : 21 October 2023 08:36 AM Views : 71

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ అసెంబ్లీ దగ్గరపడుతున్న సమయంలో రాజకీయ పార్టీల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసంతృప్తితో ఉన్న నాయకులు, టికెట్‌ ఆశించి భంగపడిన నాయకులంతా పార్టీలు మారుతున్నారు. టీడీపీ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు, తెలంగాణలో టీడీపీకి పెద్ద దిక్కుగా నిలిచిన రావుల చంద్రశేఖర్‌ రెడ్డి BRSలో చేరారు. ప్రస్తుతం ఆయన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ టీడీపీ నేతలంతా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లోకి వెళ్లినా రావుల మాత్రం టీడీపీలోనే కొనసాగారు. టీడీపీతో రావులకు దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉంది. ఇప్పుడు ఆ అనుబంధాన్ని తెంచుకొని బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం రావుల చంద్రశేఖరరెడ్డి అనుచరులతో కలిసి నేరుగా తెలంగాణ భవన్‌ వచ్చారు. అక్కడ BRS వర్కింగ్ ప్రెసిడెంట్‌ KTR సమక్షంలో BRSలో చేరారు. రావుల వంటి సీనియర్‌ నేతకు కండువా కప్పడం తన అదృష్టమని కేటీఆర్‌ అన్నారు. రావులకు గులాబీ కండువా కప్పి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు KTR. పదవుల కోసం తాను BRSలో చేరడం లేదని, ప్రజలకు సేవ చేసేందుకు BRS తగిన వేదికని తాను నమ్ముతున్నానని చేరిక సందర్భంగా రావుల అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, భువనగిరికి చెందిన నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా BRSలో చేరారు. 14 ఏళ్ల వనవాసం ముగిసిందని జిట్టా అన్నారు. జిట్టా మళ్లీ BRSలో చేరడం సంతోషకరమని KTR అన్నారు. TRS ఆవిర్భావ సమయంలో ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా జిట్టా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా టీడీపీకి భువనగిరి స్థానం దక్కడంతో BRSను జిట్టా విడిచిపెట్టారు. 2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఈ మధ్యలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు, ఆ తర్వాత YSR కాంగ్రెస్‌లోకి వెళ్లారు. యువ తెలంగాణ అనే పార్టీని కూడా ఏర్పాటు చేశారు. ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఈ మధ్య బీజేపీ నుంచి సస్పెండ్‌ కావడంతో నెల క్రితమే మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు తిరిగి పాత పార్టీలోకి అడుగుపెట్టారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన TNGO అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ కూడా BRSలో చేరారు. అటు BRSకు రాజీనామా చేసిన ఖానాపూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆర్మూర్‌లో ఆమె రాహుల్‌ గాంధీ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపు తెలంగాణలో వలసలు, చేరికల జోరు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :