Saturday, 18 May 2024 11:57:36 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కుందన్ బాగ్‌లోని ఆ ఇంటిలో నిజంగా దెయ్యాలున్నాయా – పోలీసులు చెప్పింది ఇదే

Date : 27 October 2023 10:52 AM Views : 63

జై భీమ్ టీవీ - తెలంగాణ / : కుందన్ బాగ్‌లోని ఓ పాడుబడిన భవనంలో దెయ్యాలు ఉన్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రాంతానికి వెళ్లేందుకు కూడా చాలామంది బయపడతారు. అయితే ఇటీవల కాలంలో పలువురు యూట్యూబర్లు ఆ ఇంట్లోకి వెళ్లి.. వీడియోలు తీస్తున్నారు. దెయ్యాలను తాము చూశామని వీడియోలు స్ప్రెడ్ చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలోని స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. వారు తమ గోడును పోలీసుల ముందు ఏకరువు పెట్టారు. దీంతో 35 మందిని అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు.. వారిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. 2014లో బేగంపేట కుందన్‌బాగ్‌ కాలనీలోని ఓ భవనంలో తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక పరమైన ఇబ్బందులతో వారు తనువు చాలించారు. నాటినుంచి ఆ భవనం ఉపయోగంలో లేదు. పవర్ సప్లై కూడా లేకపోవడంతో.. రాత్రి సమయంలో ఆ బిల్డింగ్ చిమ్మచికట్లు కమ్ముకుని ఉంటుంది. దీంతో ఆ భవనంలో దెయ్యాలు ఉన్నాయంటూ వ్యూస్ కోసం యూట్యూబర్లు ప్రచారం చేస్తున్నారు. తాజాగా భవనంలో దెయ్యాలు కొవ్వొత్తులు పట్టుకుని తిరుగుతున్నయంటూ యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేశారు. ఆ వీడియోలకు పెద్ద ఎత్తున వ్యూస్ రావడంతో.. బృందాలుగా ఏర్పడి ఆ బిల్డింగ్ వద్దకు వస్తున్నారు యూట్యూబర్స్. అర్ధరాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు యువకులు రాకపోకలు సాగిస్తూ ఉండడంతో కాలనీవాసుల్లో భయాందోళన నెలకుంది. ఈ వ్యవహారంపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు కాలనీవాసులు. దీంతో భవనం వద్ద పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. గడిచిన మూడు రోజుల్లో 35 మంది యూట్యూబర్లపై పెట్టీ కేసులు నమోదు చేశారు. భవనంలో దయ్యాలు లేవని స్థానికులు ఆందోళన చెందవద్దని పోలీసులు చెబుతున్నారు. “కుందన్ బాగ్‌లోని ఒక పాత భవనంపై వస్తున్న వందంతులు ఎవ్వరు నమ్మవద్దు, పుకార్లు వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కుందన్ బాగ్‌లో ప్రశాంత వాతావరణం ఉంది” అని పంజాగుట్ట పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ప్రచారంలో ఉన్న కథనం ఏంటంటే..? కుందన్ బాగ్ లో ఒక ఇంటిని దెయ్యాలతో నివాసం ఉంటున్నట్లుగా ప్రచారం ఉంది. చాలా కాలం క్రితం ఇక్కడ ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు ఆ ఇంటిలో ఉండేవారు. చీకటి పడిన తరువాత వారు కొవ్వొత్తులను పట్టుకుని ఆ ఇంటి ఆవరణలో నడిచేవారట. వారి ఇంటి ముందర బ్లడ్ నింపి ఉన్న ఓ బాటిల్ కూడా ఉండేదట. దీంతో ఆ చుట్టుపక్కల ఇళ్లవారు.. వారిని దూరం పెట్టేవారు. ఈ క్రమంలోనే ఓ దొంగ ఆ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ అక్కడ కుళ్లిపోయి.. గుర్తు పట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాలను చూసి నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసుల దర్యాప్తులో తల్లీకూతుళ్లు ముగ్గురూ మృతి చెంది ఆరు నెలలకు పైగా గడిచినట్లు నిర్దారణ అయ్యింది. దీంతో ఇన్ని రోజులు తాము చూసింది దెయ్యాల్ని అని భయపడ్డ స్థానికులు.. ఆ ఇంటివైపు వెళ్లడమే మానేశారు. ఇలాంటి భయానక ప్రచారం నేపథ్యంలో హైదరాబాద్ లో అత్యంత భయానక ప్రదేశాల్లో కుందన్ బాగ్ ఒకటిగా నిలిచింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :