Saturday, 18 May 2024 10:36:15 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నవరాత్రులకు మార్కెట్లో బతుకమ్మ పువ్వులకు డిమాండ్.. తగ్గిన మిగితా పువ్వుల రేట్లు

Date : 17 October 2023 11:18 AM Views : 71

జై భీమ్ టీవీ - తెలంగాణ / : అమావాస్య రోజు నుండి తొమ్మిది రోజుల పాటు తెలంగాణలో పువ్వుల పండుగ జరుగుతుంది. దీంతో ఏడాదికి రెండు సార్లు మాత్రమే కనిపించే బతుకమ్మ పువ్వులు హైదరాబాద్ సిటీ మార్కెట్లలో కనువిందు చేస్తున్నాయి. బతుకమ్మ పువ్వులు పల్లె నుండి పట్నం రావడంతో నగరంలో ఎక్కడ చూసిన బతుకమ్మ పువ్వులు కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. రేట్లు కూడా బడ్జెట్ లో ఉండటంతో సిటీ మార్కెట్లు బతుకమ్మ పువ్వుల కొనుగోళ్ల తో సందడిగా మారాయి. కేజీ బంతి 100 నుండి 120 రూపాయలు వరకు పలుకుతున్నాయి. చామంతి 80 నుండి 100 రూపాయలు వరకు రోజా పువ్వులు 100 నుండి 120 రూపాయలు గునుగు.. తంగేడు.. కట్ల పువ్వులకు గిరాకీ ఫుల్ గా పెరిగింది. మొదటి రోజు నుండి 9వ రోజు వరకు ఒకో పేరుతో ఒకో నైవేద్యంతో బతుకమ్మ పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలి పువ్వులు బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజున బియ్యం బతుకమ్మ, 5వ రోజు నాన బియ్యం బతుకమ్మ , 6వ రోజు అలిగిన బతుకమ్మ చేసి పూజలు చేసి బతుకమ్మ ఆడతారు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ , 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ , 9 వ రోజు సద్దుల బతుకమ్మగా తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ సంబరంగా జరుపుకుంటారు. ఆడపడుచులు.. అందుకే ఈ 9 రోజులు అని పువ్వులకు డిమాండ్ బాగా ఉంటుంది. అందుకే ఈ పండుగకు పువ్వులు గ్రామాల నుండి నగరానికి వస్తున్నాయి. చెరువులు, అడవులు, గుట్టల నుండి బతుకమ్మ పువ్వులు తెచ్చి అమ్ముతున్నాము అంటున్నారు రైతులు. గతంలో పూవులు దొరికేది కానీ ఇప్పుడు పువ్వులు దొరకడం చాలా కష్టం దాదాపు వారం రోజుల నుండి పువ్వు సేకరిస్తున్నాము అంటున్నారు. మరి కొందరు రైతులు. బతుకమ్మ కోసం ప్రత్యేకంగా గునుగు, తంగేడు, పువ్వులను ఎంత ఖర్చు చేసి అయిన బతుకమ్మను పేర్చి ఆడకుంటాము అంటున్నారు మహిళలు. పండుగకు పువ్వుల రేట్లు ఎంత ఉన్నా కొంటాము అంటున్నారు సిటీ వాసులు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :