Wednesday, 21 February 2024 08:08:15 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఆలోచించి ఓటేయండి, లేదంటే ఐదేళ్లు ఆగమే – సీఎం కేసీఆర్‌

Date : 25 November 2023 08:10 AM Views : 50

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఆలోచించి ఓటేయండి, లేదంటే ఐదేళ్లు ఆగమైపోతారంటూ మరోసారి హెచ్చరించారు కేసీఆర్‌. యాభై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనను కంపేర్‌ చేసుకోవాలన్నారు. ఎవరి పాలన బాగుందో ఆలోచించండి, ఆ తర్వాతే ఓటేయండంటూ ప్రజలను కోరారు గులాబీ బాస్‌. ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించిన కేసీఆర్‌… ప్రతి చోటా ఈ పాయింట్‌నే హైలేట్‌ చేశారు. నొక్కినొక్కి మరీ చెప్పారు. తెలంగాణ దంగల్‌ క్లైమాక్స్‌కి వచ్చేసింది. ప్రచారానికి మిగిలింది ఇంకా నాలుగే నాలుగు రోజులు. అందుకే, క్యాంపెయినింగ్‌లో మరింత స్పీడ్‌ పెంచాయి పార్టీలు. వరుస సభలు, రోడ్‌షోలు, సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు మెయిన్‌ లీడర్స్‌. గులాబీ బాస్‌ కేసీఆర్‌ అయితే ఇప్పటివరకు 80 నియోజకవర్గాలను కవర్‌ చేసేశారు. మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లిలో ప్రచారం నిర్వహించిన కేసీఆర్‌… ఎప్పటిలాగే కాంగ్రెస్‌, బీజేపీ టార్గెట్‌గా పంచ్‌ల వర్షం కురిపించారు. అభ్యర్ధులనే కాదు, ఆ అభ్యర్ధుల వెనుకన్న పార్టీలను చూడాలన్నారు కేసీఆర్‌. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో ఆలోచించి ఓటేయాలన్నారు గులాబీ బాస్‌. రామగుండం, ములుగు, భూపాలపల్లి సభల్లోనూ ఇదే పాయింట్‌ను మళ్లీమళ్లీ నొక్కిచెప్పారు గులాబీ బాస్‌. అభ్యర్ధుల వెనుకన్న పార్టీలను చూడకపోతే ఊహించని కష్టాలు ప్రజలను చుట్టుముడతాయంటూ హెచ్చరించారు. కాగా, చివరి నాలుగు రోజుల్లో సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు కేసీఆర్‌. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల నవంబర్ 25న హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో కేసీఆర్ భారీ బహిరంగ సభ రద్దయింది. రేపు, ఎల్లుండి హైదరాబాద్‌తో పాటు తెలంగాణకు వర్షసూచన ఉంది. వర్షాల నేపథ్యంలో సభను రద్దు చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. ఇక, షెడ్యూల్ ప్రకారం.. 26న ఖానాపూర్‌, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకలో… 27న షాద్‌నగర్‌, చేవెళ్ల, అందోల్‌, సంగారెడ్డిలో ప్రచారం నిర్వహిస్తారు సీఎం కేసీఆర్. చివరి రోజు, అంటే 28న వరంగల్‌ ఈస్ట్‌ అండ్ వెస్ట్‌తోపాటు సొంత నియోజకవర్గం గజ్వేల్‌తో క్యాంపెయినింగ్‌ను ముగిస్తారు కేసీఆర్‌.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :