Saturday, 18 May 2024 10:28:18 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రాజయోగం సిద్దించాలంటూ.. యాగాలు, హోమాలు చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు

Date : 11 November 2023 03:44 PM Views : 90

జై భీమ్ టీవీ - తెలంగాణ / : జనంలోనే ఉంటున్నారు.. జనంతోనే ఉంటున్నారు.. మాస్ లీడర్స్‌గా పేరు కూడా తెచ్చుకున్నారు. అయినా వారిని అదృష్టం మాత్రం వరించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి విజయం దగ్గరి వరకు వచ్చి తృటిలో తేడా కొట్టి ఓటమి పాలు కాక తప్పడం లేడు. హోరా హోరీ పోరులో రెండవ స్థానంతో సరిపెట్టుకోక తప్పడం లేదు. అయితే ఈసారి మాత్రం ఆరు నూరైనా గెలిచి తీరాల్సిందే..! ఓటర్ల దయతో పాటు అమ్మవారి ఆశీస్సులతో విజయం పక్కా చేసుకోవాల్సిందేనని ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేతలు‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఫాలో అవుతున్నారు. రాజయోగం సిద్దించాలంటే రాజశ్యామాల ఆశీస్సులు తప్పక‌ ఉండాలని.. శత్రువు బలం తగ్గి తమ బలం పెంచుకుని ప్రజాఆశీర్వాదంతో గెలిచి నిలవాలని భక్తి‌బావంతో ఎన్నికల కదనరంగంలోకి దిగుతున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, చెన్నూరు, నిర్మల్ అభ్యర్థులు ఆశలన్నీ రాజశ్యామాల మాతపైనే పెట్టుకున్నారు. శత్రువు బలం తగ్గించి తమ బలాన్ని పది రెట్లు పెంచి ప్రజా సేవ చేసేందుకు‌ అవకాశం కోరుతున్నారు. అసెంబ్లీలో ఒక్కసారైనా అద్యక్షా అనేలా ఆశీర్వదించాలని నియమ నిష్టలతో పూజలు చేస్తున్నారు. వరుస ఓటములతో నిరాశకు గురైనా ప్రజాబలం అండగా నిలవడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో‌ విజయం సాధించాలని భక్తి భావంతో ముందుకు‌ సాగుతున్నారు. ఆదిలాబాద్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్, మంచిర్యాల నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేంసాగర్ రావు, చెన్నూరులో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్, నిర్మల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల‌ ఇంద్రకరణ్ రెడ్డి రాజశ్యామాల యాగాన్ని చేపట్టి అమ్మవారి ఆశీస్సులతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్నారు. తాజా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముచ్చటగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని రాజశ్యామాల అమ్మవారి ఆశీస్సుల కోసం ప్రత్యేక‌పూజలు నిర్వహించారు. బాల్క సుమన్ సైతం వరుసగా రెండవసారి గెలుపొందాలని ఓటర్లు తమ వైపే నిలిచేలా అమ్మవారి ఆశీస్సులుండాలని‌ ప్రత్యేక పూజలు చేశారు. ఇక పాయల్ శంకర్, ప్రేంసాగర్ రావులు మాత్రం ఈసారి ఎలాగైనా గెలిచి నిలిచి అసెంబ్లీ అద్యక్షా అని నినదించాలని అమ్మవారి ఆశీస్సుల కోసం నియమ నిష్టలతో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యర్థుల బలం తగ్గి తమ ప్రజాబలం మరింతగా పెరిగి ఈసారి భారీ మెజార్టీతో గెలుపొందాలని ఈ నేతలంతా అమ్మవారిని నిష్టతో పూజించారు. ఇంతకీ రాజశ్యామాల యాగం అంటే ఏంటి.. ఫలితం ఎలా ఉంటుంది అనే కదా..! అందుకు నిదర్శనం కేసీఆర్ విజయాలే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. రాజుల కాలంలో రాజశ్యామల మాత కరుణా కటాక్షాలతో అపజయం అన్నదే లేకుండా రాజులు ముందుకు దూసుకు వెళ్లే వారని చెప్తున్నారు. రాజ్యాలు పోయాయి, రాజరికం పోయిందీ, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీస్సులు దక్కాలంటే ప్రజాబలంతో పాటు శత్రువు బలం తగ్గేలా అమ్మవారిని మనస్ఫూర్తిగా భక్తి భావంతో కొలవాలని కొందరు నేతలు బలంగా నమ్మడం, ఆ నమ్మకం నిజమవడంతోనే ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ నలుగురు నేతలు రాజశ్యామాల యాగం నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రాజసూయ యాగం, రాజశ్యామల యాగం ఒకటేనా అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే వేద పండితులు ఆ రెండు యాగాల ఫలితం ఒకటే, అయినా ఈ రెండు యాగాలు వేరు వేరు అంటున్నారు. రాజసూయ యాగం అంటే శాశ్వత అధికారాన్ని అందించే యాగం అని.. ‘సూయం’ అంటే శాశ్వతం. రాజ్యాన్ని, రాజుని శాశ్వతంగా పాలన‌ సాగించేలా ఆశీస్సులు అంద చేసేది అని చెప్తున్నారు. తమ సార్వభౌమాత్వాన్ని ప్రకటించుకునేందుకు రాజు నుంచి చక్రవర్తిగా మారే క్రమంలో చేసే యాగమే రాజసూయ యాగం అంటున్నారు. రాజసూయ యూగ ఫలితం శత్రువు ఎదురు నిలిచేందుకు కూడా సాహసించలేడని చెప్పేందుకు ప్రతీక. ఈ యాగాన్ని అత్యంత కఠిన నిబద్దతో.. ఏడాది కాలం చేస్తారని, మండల కాలం అంటే 41 రోజులు. అర్థమండలం 21 రోజులు పాటు కూడా చేస్తారని, ఈ యాగం ముగిసిన తర్వాత పూర్ణాహుతి సమర్పించే సమయానికి అక్కడున్న సభలో ఎవరు గొప్పవారైతే వారికి ధానం చేస్తారు. ఫలితంగా యాగం చేసిన వారికి పుణ్యంతో పాటు రాజ్యం శాశ్వతమవుతుందని ప్రతీతి. అయితే రాజ శ్యామల యాగం మాత్రం అర్థమండల కాలం నుండి 3 రోజుల వ్యవధిలో చేసే స్వల్పకాల యాగం అని చెప్తున్నారు వేదపండితులు. రాజ శ్యామల యాగం చేయడంతో రాజ్యలక్ష్మి వరిస్తుందని, అనుకున్న విజయం దక్కుతుందని, విజేతగా నిలుపుతుందని చెప్తున్నారు వేదపండితులు. రాజశ్యామల యాగం చేస్తే శత్రువు బలం తగ్గుతుందని, రాజకీయాల్లో విజయలక్ష్మి వరిస్తుందని విశ్వసిస్తారు. అధికారం రావడానికి, శత్రువుల బలం తగ్గడానికి, జన వశీకరణ కోసం ఈ యాగం చేస్తారని పండితులు వెల్లడిస్తున్నారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికలకు ముందు రాజ శ్యామల యాగం చేసి వరుస ఎన్నికల్లో విజేతగా నిలవడంతో ఆయననే ఆదర్శంగా తీసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ నేతలు‌ ఈ‌సారి ఓటర్ల ఆశీస్సులతో పాటు అమ్మవారి ఆశీస్సులు‌ దండిగా ఉండాలని ఈ‌యాగం చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల విజయం తరువాత ఈ నేతలంతా సహస్ర చండీ యాగం చేసే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ యాగం చేసిన ప్రతిసారీ అందుకు ప్రతిఫలం పొందారని, తమకు కూడా మంచి ఫలితాలు దక్కుతాయని ఈనేతలంతా బలంగా నమ్ముతున్నారు. చూడాలి మరీ అమ్మవారు ఆశీర్వదించి ఈ నేతలను అసెంబ్లీకి పంపిస్తుందా.. ? నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో జనాన్ని ఈనేతల వైపు నిలిచేలా ఆశీస్సులు అందిస్తుందా.. లేదా? డిసెంబర్ 3 ఫలితాల్లో తేలనుంది. విశ్వాసం ఎన్నటికి ఓటమి చెందదు.. నమ్మకమే మహాబలం..!

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :