Saturday, 18 May 2024 10:28:16 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

TSPSC పేపర్ లీక్ : ఈడీ Vs సిట్

Date : 13 April 2023 05:31 PM Views : 116

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ వర్సెస్ ఈడీగా మారింది. ఈ కేసులో రంగంలోకి దిగిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్..సిట్ను వివరాలు ఇవ్వాల్సిందిగా మార్చి 23వ తేదీన లేఖ రాసింది. పేపర్ లీక్ కేసుకు సంబంధించిన మొత్తం 8 డాక్యుమెంట్ల ఇవ్వాలని లేఖలో కోరింది. అయితే ఈడీ లేఖకు సిట్ అధికారులు స్పందించకపోవడంతో నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదంటూ పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణం లో దర్యాప్తు చేయాలని భావించిన ఈడీ..కేసు వివరాలు ఇచ్చేలా సిట్ కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరింది. అటు ఈడి పిటిషన్ పై సిట్ కూడా కౌంటర్ దాఖలు చేసింది. కేసు కీలక దశలో ఉన్నందున వివరాలు ఇవ్వడం కుదరదని వివరిచింది. దీనిపై విచారణ జరగనుంది. మరోవైపు TSPSCపేపర్‌ లీక్‌ కేసులో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్ శంకరలక్ష్మీ ఈడీ ఎదుట హాజరయ్యారు. సెక్షన్ 50 ప్రకారం శంకర్ లక్ష్మీ వాగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. శంకరలక్ష్మీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్‌గా ఉన్న నేపథ్యంలో.. ప్రవీణ్, రాజశేఖర్‌లకు పేపర్లు ఎలా చేరాయనే వివరాలను ఈడీ ఆరా తీసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌కు సంబంధించి సిట్ నమోదు చేసిన కేసులో శంకరలక్ష్మీని పేర్కొంది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్.. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్ శంకరలక్ష్మీతో పాటు అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణలకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 13న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇందులో భాగంగా శంకరలక్ష్మీ ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. TSPSC కేసులో ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టింది. పబ్లిక్ డొమైన్ ద్వారా ఇప్పటికే వివరాలు సేకరించిన ఈడీ.. ECIR నమోదు చేసింది. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయని ఈడీ గుర్తించింది.ఈ కేసులో ప్రధాన నిందితులు రాజశేఖర్, ప్రవీణ్‌ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై నిందితుల తరపు న్యాయవాది స్పందనను తెలియజేయాల్సిందిగా అతనికి నోటీసులు జారీ చేసింది. టీఎస్‌పీఎస్‌సీ నిందితుల వద్ద నుంచి సిట్ 7లక్షలు సేకరించింది. 40లక్షలు డబ్బులు చేతులు మారాయని గుర్తించింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :