Saturday, 18 May 2024 01:11:16 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కాంగ్రెస్- కమ్యూనిస్టుల పొత్తు పొడిచింది.. లెఫ్ట్ పార్టీల పోటీ అక్కడే.. అధికారిక ప్రకటనే తరువాయి

Date : 25 October 2023 09:35 PM Views : 65

జై భీమ్ టీవీ - తెలంగాణ / : కాంగ్రెస్‌తో కమ్యూనిస్టుల పొత్తు ఎట్టకేలకు కన్ఫామ్ అయింది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా సిపిఐ, సిపిఎంలకు చెరో రెండు స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ తేల్చి చెప్పడంతో వాటికి లెఫ్ట్ పార్టీలు సైతం మౌఖికంగా సరే అన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటనకు ముందే వామపక్షాలతో పొత్తుపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో వామపక్షాలు కాంగ్రెస్‌తో కలిసి బరిలో దిగేందుకు అంత సిద్ధమైంది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ రెండో జాబితా కోసం కసరత్తు చేస్తూనే వామపక్షాలకు కేటాయించాల్సిన సీట్లను కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో లెఫ్ట్ పార్టీలతో పొత్తు దాదాపు ఖరారు అయిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. సిపిఐ, సిపిఎం చేరో అయిదు స్థానాలు కాంగ్రెస్‌ను కోరగా.. చెరో రెండు స్థానాలు ఇచ్చేందుకు హస్తం నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సిపిఐకి కొత్తగూడెం, చెన్నూరు కేటాయించగా.. సిపిఎంకు మిర్యాలగూడతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా సీటును ఇచ్చేందుకు సరే అన్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాజకీయ అవగాహన కుదిరినా.. సీట్ల అంశం తేలలేదంటూ అటు కాంగ్రెస్ ఇటు వామపక్ష నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం అది కూడా కొలిక్కి రావడంతోటి ఇక అధికారిక ప్రకటన తరువాయి అంటున్నారు నేతలు. వామపక్షాలు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలోనే ప్రాబల్యం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచే సీట్లు ఇవ్వాలని పట్టు పట్టడం.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హౌస్‌ఫుల్ కావడంతో సీట్ల పంచాయతీ ఇంతకాలం సాగుతూ వచ్చింది. సిపిఐ, సిపిఎం కోరిన స్థానాల్లో ఒక సీటు వాళ్ళు అడిగినది మరొక సీటు కాంగ్రెస్ అనుకున్నది ఇచ్చేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకే సిపిఐ అడిగినదాంట్లో కొత్తగూడెం దానికి తోడుగా చెన్నూరు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముగ్గు చూపింది. సిపిఎంకి సంబంధించి మిర్యాలగూడతో పాటు పాలేరు కావాలని పట్టుబట్టగా పాలేరు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పి ఖమ్మం జిల్లాలోనే వైరా సీటును కేటాయిస్తామని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలకు వామ పక్షాలు సైతం మౌఖికంగా సరే అన్నాయి. మునుగోడు సీటు తమకు కేటాయించాల్సిందేనని సిపిఐ నల్గొండ నేతలు పట్టుబట్టారు. మునుగోడు లేకుండా పొత్తు ప్రస్తావనే వద్దన్న నేతల వ్యాఖ్యలు ఇప్పుడు హార్ట్ టాపిక్ గా మారాయి. అయితే మునుగోడుపై భేదాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవమేనని అధిష్టాన నిర్ణయానికి ఫైనల్ గా నేతలంతా కట్టుబడి ఉండాల్సిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మునుగోడు కాంగ్రెస్‌ సీటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తామంటేనే ఆయన పార్టీలో చేరుతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో మునుగోడులో కాంగ్రెస్సే బరిలో ఉంటుందని సిపిఐకి గతంలో కేటాయించిన సీట్లనే ఓకే చేసినట్లు తెలుస్తోంది. సిపిఐకి కేటాయించిన సీట్లలో కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు, చెన్నూరు నుంచి చంద్రశేఖర్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు సిపిఎం తరపున మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి, వైరా నుంచి భూక్య వీరభద్రం పోటీలో ఉండనున్నారు. పొత్తుపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత.. ఈ నలుగురు అభ్యర్థులను సైతం లెఫ్ట్ పార్టీలు ప్రకటించనున్నాయి. పొత్తు కుదిరాక రెబల్స్ పోటీలో దిగకుండా చూడాల్సిన బాధ్యత ఆయా పార్టీలదేనని నేతలు అంటున్నారు. మునుగోడులో స్నేహపూర్వక పోటీకి నల్గొండ సీపీఐ నేతలు సై అంటుండటంతో అక్కడ పోటీ లేకుండా సంపూర్ణ మద్దతు ఇచ్చేలా చూడాలని కాంగ్రెస్, సీపీఐని కోరుతుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :