Saturday, 18 May 2024 11:57:39 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

షర్మిల అరెస్ట్‌పై స్పందించిన తెలంగాణ గరర్నర్ తమిళిసై

రాజశేఖర్ రెడ్డి కుమార్తె అంటూ

Date : 30 November 2022 11:48 AM Views : 193

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల కారులో ఉండగానే ఆమె కారును లాక్కెళ్లిన దృశ్యాలు కలవరపెట్టాయని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు.ఒక అలజడి, రెండు రోజుల హైటెన్షన్ తర్వాత మళ్లీ గురువారం షర్మిల పాదయాత్ర షురూ కాబోతుంది. ఎక్కడ ఆగిందో.. అక్కడే మొదలు కాబోతుంది. మహబూబాబాద్ జిల్లా జిల్లా లింగగిరి నుంచే షర్మిల పాదయాత్ర ప్రారంభం అవుతుంది. టీఆర్‌ఎస్ అడ్డంకులను ఎదుర్కొనేలా దీటైన వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. యాత్రకు సంబంధించి అర్థరాత్రే మరో యాక్షన్ ప్లాన్‌ రెడీ అయ్యిందంట. షర్మిల వర్సెస్ టీఆర్ఎస్. మధ్యలో బీజేపీ. మంగళవారం జరిగిన హైటెన్షన్‌ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది బీజేపీ. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. మంగళవారం హైదరాబాద్‌లో షర్మిలను అరెస్టు చేసిన తీరుపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ వైరుధ్యాలు.. పార్టీల సిద్ధాంతాలు ఎలా ఉన్నా.. ఒక మహిళను.. పార్టీ నాయకురాలి పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాల్సిందని అభిప్రాయపడ్డారు. షర్మిల కారులో ఉండగానే.. టోయింగ్‌ చేస్తూ తరలించే దృశ్యాలను చూసి తీవ్రంగా కలత చెందానన్నారు తమిళిసై. సోమవారం నర్సంపేటలో షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హైదరాబాద్‌ తరలించారు. వరంగల్ జిల్లాలో తన పాదయాత్రపై టీఆర్‌ఎస్ మద్దతుదారుల దాడికి నిరసనగా ముఖ్యమంత్రి నివాసానికి పాదయాత్రగా వెళుతుండగా రాజ్ భవన్ రోడ్డులో హైడ్రామా మధ్య పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ముందు రోజు అధికార టీఆర్‌ఎస్‌ వర్గీయుల దాడిలో ధ్వంసమైన కారును నడుపుతూ వచ్చారు షర్మిల. ఆమెను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించేగా.. కారు దిగేందుకు నిరాకరించారు. దీంతో పోలీసులు టోయింగ్ వెహికల్‌ పిలిపించి.. ఆమె కారులో కూర్చుని ఉండగానే పీఎస్‌కు తీసుకెళ్లారు. మంగళవారం రాత్రి పోలీసులు షర్మిలను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, ఆయన బెయిల్ మంజూరు చేశారు. కాగా షర్మిల మాట్లాడే తీరుపై టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది? కేసీఆర్‌‌ది రాజశేఖర్ రెడ్డి వయస్సు అని.. అలాంటి వ్యక్తిని వాడు, వీడు అనొచ్చా అని భగ్గుమంటున్నారు కారు పార్టీ నేతలు. స్థానిక ఎమ్మెల్యేలను ఏ మాట పడితే ఆ మాట అనడం ఏం సంస్కారం అని ప్రశ్నిస్తున్నారు. షర్మిల, బీజేపీ నాయకులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైర్లు తాము వదిలిన ‘బాణం’ ..తానా అంటే తందానా అంటున్న ‘తామర పువ్వులు’ అంటూ ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. మంగళవారం జరిగిన ఘటనలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ షర్మిలకు మద్దతుగా నిలవడంతో ఆమె ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :