Saturday, 18 May 2024 10:36:23 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం

Date : 20 April 2023 03:01 PM Views : 129

జై భీమ్ టీవీ - తెలంగాణ / రాజన్న సిరిసిల్ల జిల్లా : జై భీమ్ ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలక్షిషన్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి.గత ఎన్నికల్లో ఇల్లంతకుంట మండలానికి ఇచ్చిన పలు హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించారు.ఈ ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు.అయితే ప్రభుత్వానికి,ఎమ్మెల్యే రసమయికి వ్యతిరకంగా వెలిసిన పోస్టర్లు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.ఫ్లెక్సీల్లో ఏముందంటే మోసం చేసిన దొర దగా పడిన జనం అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వాన్ని నిలదీశారు.ఇల్లంతకుంట మండలంలో ఎంతమంది దళితులకు దళిత బంధు ఇచ్చావు!ఎంతమంది దళితులకు 3 ఎకరాల భూమిని ఇచ్చావు,ఎంతమందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చావు,ప్రతి మండలంలోని సర్పంచ్ లు నిధులు లేక ఆత్వహత్యలు చేసుకుంటున్నారో చూడు,ఇల్లంతకుంట మండలంలోని డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తానన్నవి చేప్పతావా?8 సంవత్సవాలు గడిచాయి.గుర్తుందా? ఇల్లంతకుంట యువతకు క్రీడా ప్రాంగణం ఇస్తానన్నావు?అంటూ ప్రశ్నించారు.మరోఫ్లెక్సీలో...విప్పల,దాచారం,బోటుమీదపల్లి వరకు సీసీ రోడ్డు వేస్తానని భూమిపూజ చేశావు.ఇంతవరకు దాని జాడేలేదు.దాచారం గ్రామంలో ఇంతవరకు డబుల్ బెడ్ రూమ్స్ లేనే లేవు,కుల సంఘాలను కట్టిస్తానని హామీ ఇచ్చారు.ఇంతవరకు కట్టించలేదు.బస్ స్టేషన్ కట్టిస్తానని భూమిపూజ చేసి చివరకు దాన్ని కూడా మరిచారు.బస్ స్టేషన్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సారు. ఇక చాలు బై.. బై..అంటూ ఫ్లెక్సీల్లో అగంతకులు కామెంట్లు చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :