Saturday, 18 May 2024 12:36:42 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మారుతున్న సమీకరణాలు.. కండువాలు మారుస్తున్న నేతలు.. ఓరుగల్లులో బీజేపీకి షాక్‌!

Date : 17 October 2023 06:30 PM Views : 83

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఎన్నికల టైమ్‌ దగ్గరపడుతోంది. తెలంగాణవ్యాప్తంగా కొత్త కొత్త చేరికలు..సీనియర్‌ నేతల పార్టీల మార్పులతో సరికొత్త సమీకరణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో బిజెపికి ఊహించని షాక్‌ తగిలింది. సీనియర్‌ నేత కాషాయం పార్టీని వదిలి హస్తం పార్టీలో చేరడం ఖాయమైపోయింది. మరి వెళ్లబోతూ..సంచలన కామెంట్స్‌ చేశారు ఆ పెద్దాయన. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కమలం పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారు. కాంగ్రెస్‌లో ఆయన చేరికకు ముహూర్తం దాదాపు ఖరారైపోయింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తుమ్మల, పొంగులేటి సహా పలువురు సీనియర్లు రేవూరి ప్రకాష్‌రెడ్డితో మంతనాలు జరపటంతో..కాషాయ కండువా పక్కన పెట్టబోతున్నారు రేవూరి. రెడ్డి సామాజికవర్గం అంతా ఒకేతాటి పైకి వచ్చి బీఆర్‌ఎస్‌ని ఓడించాలన్న టార్గెట్‌తో ఉంది కాంగ్రెస్‌. అందుకే రేవూరిని తమతో కలిసి రావాలని కాంగ్రెస్‌ నేతలు కోరినట్లు సమాచారం. ఆయన కూడా సానుకూలంగా స్పందించటంతో కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారైపోయింది. ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు రేవూరి. >>spot తెలంగాణలో బీజేపీ గ్రాఫ్‌ పడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవూరి ప్రకాశ్‌రెడ్డి. ఒకప్పుడు కాంగ్రెస్‌లో గ్రూపుల గోల ఉండేదని, ఇప్పుడు బీజేపీలోనూ గ్రూప్‌ పాలిటిక్స్‌ పెరిగిపోయాయన్నారు. నేతల మధ్యే ఏకాభిప్రాయం లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ ఒక్కటే ప్రత్నామ్నాయన్నారు. బండి సంజయ్‌ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి బీజేపీ సెల్ఫ్‌గోల్‌లో పడిపోయిందన్నారు. రేవూరి పార్టీ వీడతారన్న వార్తతో నర్సంపేట బీజేపీలో గందరగోళం నెలకొంది. నర్సంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కొన్నాళ్లుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు రేవూరి. ఇప్పుడాయన కాంగ్రెస్‌లో చేరాలన్న నిర్ణయానికి రావటంతో.. నర్సంపేటలో బీజేపీ అభ్యర్థి ఎవరన్న ప్రశ్న మొదలైంది. మరోవైపు నర్సంపేటలో ఇప్పటికే కాంగ్రెస్‌ దొంతి మాధవరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో రేవూరి ప్రకాష్ రెడ్డిని ఎక్కడినుంచి బరిలోకి దింపుతారనే చర్చ మొదలైంది. రేవూరిని పరకాల నుంచి పోటీకి దించే వ్యూహంతో కాంగ్రెస్‌ ఉందంటున్నారు. అధినాయకత్వం ముందు కూడా అదే ప్రతిపాదన పెట్టిందట తెలంగాణ కాంగ్రెస్‌. రేవూరి ప్రకాష్‌రెడ్డి కూడా పరకాల నుంచి పోటీకి సుముఖంగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ వేవే ఉందన్న అభిప్రాయంతో ఉన్న రేవూరి.. పరకాల నుంచైనా గెలవగలనన్న ధీమాతో ఉన్నారట. అందుకే కాంగ్రెస్‌ నాయకత్వం ప్రతిపాదనకు ఆయన సానుకూలంగా స్పందించారని, పరకాలపై దృష్టి పెట్టబోతున్నారని చెబుతున్నారు. రేవూరి బుధవారం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. మరి రేవూరి పరకాల నుంచి పోటీచేస్తే ఇప్పటికే పరకాలపై ఆశలు పెట్టుకున్న కొండా మురళి, ఇనుగాల వెంకట్రామిరెడ్డి పరిస్థితేంటన్న చర్చ జరుగుతోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :