Saturday, 18 May 2024 11:19:40 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఈ ప్రాంతాల్లో భూములు కొంటే జాక్‌పాట్‌ కొట్టేసినట్లే.. లాభాలే లాభాలు..

Date : 27 October 2023 10:48 AM Views : 67

జై భీమ్ టీవీ - తెలంగాణ / : భూమిపై పెట్టుబడి పెట్టిన వారు ఎప్పటికీ నష్టపోరు అనే ఒక నానుడి ఉంది. జనాభా రోజురోజుకీ పెరుగుతుంది కానీ పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా భూమి మాత్రం పెరగదు అనేది అక్షర సత్యం. అందుకే భూమికి ఉన్న విలువ మరేదానిఇక ఉండదని చెబుతుంటారు. రియల్ ఎస్టేట్‌ రంగం ఓ రేంజ్‌లో అభివృద్ధి చెందుతుండడానికి ఇదే ప్రధాన కారణం. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొన్నటి మొన్న కోకాపేట్‌లో ఎకరం రూ. వంద కోట్లకు అమ్ముడుపోయి ప్రపంచాన్నే విస్మయానికి గురి చేసింది. దేశంలో ఒక ఎకరం ఇంత మొత్తానికి అమ్ముడుపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతేకాకుండా హైదరాబాద్‌కు నలుమూలల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. విదేశీ పెట్టుబడి దారులు, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతుండడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. కొలియర్స్ ఇండియా అనే సంస్థ.. ఇటీవల భారత్‌లో భూముల కొనుగోళ్లలో అగ్ర స్థానంలో ఉన్న పట్టణాల జాబితాను విడుదల చేసింది. ఇందులో టాప్‌ 5 కారిడార్లలో హైదరాబాద్‌ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. భారత్‌లో భూములపై పెట్టుబడులు పెట్టడానికి అనువైన నగరాల్లో హైదరాబాద్‌ ఒకటని ఈ సంస్థ తెలిపింది. కొలియర్స్‌ ఇండియా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. హైదరాబాద్‌లోని మేడ్చల్‌, కొంపల్లి, శామీర్‌పేట్‌ ప్రాంతాలు పెట్టుబడులకు అనువైన ప్రాంతాలుగా తెలిపింది. ఈ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసిన వారికి భవిష్యత్తులో ఢోకా ఉండదని తెలిపింది. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో భూములపై పుట్టుబడులు పెట్టిన వారికి వచ్చే పదేళ్లలో మూడు రెట్లు రిటర్న్స్ పొందొచ్చని కొలియర్స్‌ ఇండియా నివేదిక అంచనా వేసింది. హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని నేరల్‌, మాతేరన్, గుజరాత్‌లోని సనంద్‌, నల్‌సరోవర్‌ భూములు పెట్టుబడులకు టాప్‌-5 కారిడార్లుగా కొలియర్స్‌ ఇండియా తెలిపింది. ఈ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టిన వారికి కూడా మంచి లాభాలు ఖాయమని కొలియర్స్‌ ఇండియా తన నివేదికలో పేర్కొంది. మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :