Saturday, 18 May 2024 12:36:38 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

హ్యాట్రిక్‌ టార్గెట్‌గా దూకుడు పెంచిన సీఎం కేసీఆర్.. ఇవాళ సిరిసిల్ల, సిద్ధిపేటలో పర్యటన

Date : 17 October 2023 11:16 AM Views : 93

జై భీమ్ టీవీ - తెలంగాణ / : రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రత్యర్ధులకు అందని స్పీడ్‌లో ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు( సీఎం కేసీఆర్). ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్‌.. కరెంట్‌.. ధరణి.. ఈ అంశాలనే ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తమ పాలనను 60ఏళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకుని ఓటు వేయాలంటూ ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరెవరో వచ్చి ఏవేవో చెప్తుంటారు. అంతమాత్రాన ఆగం కావొద్దంటున్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సిద్ధిపేట, సిరిసిల్లలో సీఎం కేసీఆర్ పర్యటించబోతున్నారు. సిరిసిల్లలో సీఎం పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి సిరిసిల్ల పట్టణంలోని సభాస్థలి దగ్గర ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. సాయంత్రం 5 గంటలకు సిద్ధిపేటకు సీఎం కేసీఆర్‌ చేరుకుంటారు. సిద్ధిపేటకు రైలు వచ్చిన తర్వాత తొలిసారి సీఎం కేసీఆర్ పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎంకి భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి 20వేల మంది యువకులు బైక్‌లపై సభకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు మంత్రి హరీష్‌రావు. దాదాపు లక్ష మంది జనసమీకరణతో సభను విజయవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం భువనగిరి, జనగామలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఓట్ల కోసం ఇతర పార్టీల్లా తాము అబద్ధాల మేనిఫెస్టో పెట్టలేదన్నారు. దేశంలో దళితబంధు పెట్టాలనే ఆలోచన ఏ సీఎంకు అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ మళ్లీ గెలిస్తే.. 93 లక్షల మందికి కేసీఆర్‌ బీమా అమలు చేస్తామన్నారు. ధరణిని తీసేస్తామని.. వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ చాలని చెబుతున్న కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలో కలపాలన్నారు. తెలంగాణ రాకపోతే భువనగిరి జిల్లా అయి ఉండేది కాదన్న కేసీఆర్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వం భువనగిరిలో అరాచక శక్తులను పెంచి పోషించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ వస్తే.. ధరణి పోయి మళ్లీ దళారుల రాజ్యం వస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ను మరోసారి గెలిపించుకుని 24 గంటల కరెంటును కొనసాగించుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో తొలిరోజు 69 మందికి బీఫాంలు ఇచ్చిన సీఎం కేసీఆర్‌.. రెండో రోజు ప్రగతి భవన్‌లో మరో 28 మందికి బీఫార్మ్‌లు ఇచ్చారు. మిగిలిన వాళ్లకు ఇవాళ, రేపటిలోగా బీఫాంలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బీఫార్మ్‌లు నింపేప్పుడు జాగ్రత్త వహించాలని.. అవసరమైతే పార్టీ లీగల్‌ సెల్‌ సలహాలు తీసుకోవాలని నేతలకు మరోసారి సూచించారు కేసీఆర్‌.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :