Saturday, 18 May 2024 09:42:19 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. ఇద్దరు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు..

Date : 18 November 2023 08:10 AM Views : 65

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇది ప్రచారంలో పాల్గొనే రాజకీయ నాయకులకే కాదు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఎన్నికల సంఘం అధికారుల చేతిలో ఉంటుంది. వారి ఆదేశాను సారం ప్రతి డిపార్ట్మెంట్ తమ విధులను నిర్వర్తించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అధికారి ఈసీ ఆదేశాలకు లోబడి నడుచుకోవల్సి ఉంటుంది. అయితే ఇలా తమ విధుల్లో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది ఈసీ. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) ఉల్లంఘించినందుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ ఎండీ మనోహర్ రావు, ఆయన ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తున్న రిటైర్డ్ ఆఫీసర్ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల కమిషన్. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో దిగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గత నెల 15,16 తేదీల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఈ ఇద్దరు అధికారులు ఆయనతో పాటూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లడం రాజకీయంగా కొంత చర్చ జరిగింది. దీంతో కొందరు నాయకులు ఈ ఇద్దరు అధికారులపై రాష్ట్ర సీఈవోకి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపింది. దీనిపై స్పందించిన ఈసీ ఆ ఇద్దరు అధికారులను ప్రస్తుతం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిని ఈసీ ఆదేశించింది. దీంతో ఈ ఇద్దరు అధికారులకు పర్యాటక శాఖ నోటీసులు పంపింది. తిరుమల వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఒక నివేదిక రూపంలో తమకు ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా పంపాలని గడువు ఇస్తూ నోటీసుల్లో పేర్కొంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :