Saturday, 18 May 2024 01:11:15 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఈ నెల 25, 26, 27 తేదీల్లో తెలంగాణలో మోదీ ఎన్నికల ప్రచారం

Date : 11 November 2023 03:47 PM Views : 67

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది బీజేపీ. అందుకు తగ్గట్లుగానే అగ్రనేతలు క్యాంపైయిన్ చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రధాని పర్యటన ఉంది. అంతేకాదు నవంబర్ 25, 26, 27 తేదీల్లో కూడా మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 25న కరీంనగర్, 26న నిర్మల్ జన గర్జన సభల్లో ప్రధాని పాల్గొంటారు. 27న హైదరాబాద్ లో మోడీ భారీ రోడ్ షో ఉంటుంది. ఈ లోపు మరికొందరు కేంద్ర మంత్రులు, పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. నేడు మాదిగల విశ్వరూప సభలో పాల్గొననున్న ప్రధాని ఎస్సీలకు గంపగుత్తగా కాకుండా అందులోని కులాలను బట్టి రిజర్వేషన్లు కల్పించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏళ్లుగా డిమాండ్‌ చేస్తోంది. దళిత కులాల గణన ప్రత్యేకంగా చేపట్టాలని కోరుతోంది. ఎస్సీల్లో ప్రభావవంతంగా మాల వర్గానికే అధిక రిజర్వేషన్లు అందుతున్నాయని, జనాభాపరంగా అధికంగా ఉన్నప్పటికీ మాదిగలకు ఆ ఫలాలు అందని మావిగా మారిపోయాయని MRPS అంటోంది. మాదిగ విశ్వరూప సభలో ప్రధాని మోదీ ఈ అంశం గురించి మాట్లాడతారని ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణపై హామీ ఇస్తారని MRPS భావిస్తోంది. ఎస్సీ వర్గీకరణ జరపాలని దాదాపు 30 ఏళ్లుగా MRPS డిమాండ్‌ చేస్తోంది. ఈ డిమాండ్‌కు బీజేపీ కూడా సానుకూలంగా స్పందించింది. పార్లమెంట్‌లో చట్టం చేయాలి కాబట్టి వర్గీకరణకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. తెలంగాణలోని ఎస్సీ జనాభాలో 60 శాతం మంది మాదిగలు ఉంటారని అంచనా. 2014లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో మాదిగ జనాభా 46 లక్షలని, మాలల జనాభా 21 లక్షలని MRPS వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో 20-25 నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేసే స్థాయిలో మాదిగలు ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో MRPS కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడమే కాదు ఆ పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించింది. ఈ ఎన్నికల్లో MRPS తమ మద్దతు ఎవరికన్నది ఇంత వరకు ఎక్కడా బహిరంగంగా ప్రకటించలేదు. ఈ క్రమంలో ఆ సంఘం నిర్వహిస్తున్న సభకు ప్రధానిని ఆహ్వానించడం చూస్తుంటే కమలం వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గత నెల ఢిల్లీలో హోం మంత్రి అమిత్‌ షాను కలిసి వర్గీకరణపై విజ్ఞాపన పత్రం అందజేశారు. దీనికి షా సానుకూలంగా స్పందించారనే మంద కృష్ణ వెల్లడించారు. ఈ క్రమంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరుగుతున్న సభలో ప్రధాని మోదీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేస్తారని MRPS గట్టి నమ్మకంతో ఉంది. ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ అధికార పార్టీ BRS సానుకూలంగానే ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్‌ చేసింది. 2014లో నిర్వహించిన తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అలాగే ఎస్సీ రిజర్వేషన్‌ను 15 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :