Saturday, 18 May 2024 10:51:42 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి.. కేసీఆర్‌పై జరిగినట్టే..! ఆసుపత్రికి సీఎం కేసీఆర్

Date : 30 October 2023 07:31 PM Views : 70

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం తెలంగాణలో కలకలం రేపింది. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండగా.. దుండగుడు కత్తితో దాడి చేశాడు. దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరచాలనం చేసేందుకు వచ్చిన రాజు అనే వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో గాయపడ్డ ప్రభాకర్‌రెడ్డిని మొదట గజ్వేల్‌లోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌ యశోద హాస్పిటల్‌లో కొత్త ప్రభాకర్‌రెడ్డికి చికిత్స కొనసాగుతోంది. నారాయణఖేడ్‌ సభకు వెళ్తుండగా మంత్రి హరీశ్‌రావుకు దాడి సమాచారం అందింది. వెంటనే ఎంపీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు మంత్రి హరీష్‌రావు. కొత్త ప్రభాకర్‌రెడ్డికి చికిత్స చేసిన డాక్టర్‌ ఎంపీ ఆరోగ్య పరిస్థితిని వివరించారు. హైదరాబాద్ తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న సీఎం కేసీఆర్ హరీష్‌ రావుకు ఫోన్ చేసి ప్రభాకర్‌ రెడ్డి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ప్రభాకర్ రెడ్డికి చికిత్స గురించి ఆరాతీశారు. నారాయణ ఖేడ్ సభ అనంతరం సీఎం కేసీఆర్.. ప్రభాకర్ రెడ్డిని పరామర్శించేందుకు ఆసుపత్రికి రానున్నారు. ప్రభాకర్ రెడ్డికి ప్రాణాపాయం లేదని హరీశ్ రావు తెలిపారు. ఆసుపత్రికి వెళ్లి ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన హరీష్ రావు.. వైద్యులను కలిసి మాట్లాడారు. ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు.. ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి బాన్సువాడ కేంద్రంగా సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చేతకాని దద్దమ్మలు కొత్త ప్రభాకర్‌పై దాడిచేశారు.. ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి.. కేసీఆర్‌పై దాడి జరిగినట్లే.. తెలంగాణలో ఎన్నికల సమయంలో ఎప్పుడూ హింస జరగలేదు.. ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు అంటూ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. అభివృద్ధికి ఏకైక కొలమానం – తలసరి ఆదాయం.. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్.. పదేళ్లు నీతి, నిబద్ధతతో పనిచేస్తేనే అది సాధ్యమైంది.. అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. పోచారం సారథ్యంలో బాన్సువాడ..బంగారువాడ అయ్యిందని.. గెలిచిన తర్వాత పోచారం శ్రీనివాస్‌కి పెద్దహోదా దక్కుతుంది.. అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వీడియో.. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించిన రేవంత్ రెడ్డి.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ పార్టీ హింసను ఎప్పుడు నమ్ముకొదు.. కాంగ్రెస్ పార్టీ అహింస మూల సిద్ధాంతంగా పని చేస్తున్న పార్టీ అంటూ పేర్కొన్నారు. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థిగా ఉన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన సంఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కత్తితో దాడి చేసిన వ్యక్తి ఎవరైనా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఈ విషయంలో వెంటనే పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ జరిపి విషయాలను బయటపెట్టాలి.. అంటూ రేవంత్ పేర్కొన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :