Saturday, 18 May 2024 09:42:07 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

టికెట్లపై ఆ సామాజిక వర్గం ఆందోళన.. పార్టీలు సీరియస్‌గా తీసుకుంటున్నాయా

Date : 08 October 2023 08:45 AM Views : 102

జై భీమ్ టీవీ - తెలంగాణ / : కమ్మ సామాజిక వర్గం ఆందోళన ఏదో రాజకీయంగా తాత్కాలికంగా రేగిన చిచ్చు కాదు. దశాబ్దాల పాటు తమకేంటి..అన్న ప్రశ్న నుంచి ఉదయించిన ఉద్యమం. అక్కడ రేణుక చౌదరి కాంగ్రెస్ నేతగా కనిపిస్తున్నా...కాంగ్రెస్సే కావాలని కమ్మవర్గాల్లో చిచ్చుపెట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నా.. బీఆర్ఎస్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలన్న లక్ష్యంతోనే కమ్మ సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారన్న వెర్షన్ గట్టిగా ప్రచారంలోకివచ్చినా...ఇది కచ్చితంగా తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే సీరియస్ అంశంగానే చూడాలన్నది విశ్లేషకుల నుంచి వస్తున్నమాట. Telangana: టికెట్లపై ఆ సామాజిక వర్గం ఆందోళన.. పార్టీలు సీరియస్‌గా తీసుకుంటున్నాయా ? కమ్మ సామాజిక వర్గం ఆందోళన ఏదో రాజకీయంగా తాత్కాలికంగా రేగిన చిచ్చు కాదు. దశాబ్దాల పాటు తమకేంటి..అన్న ప్రశ్న నుంచి ఉదయించిన ఉద్యమం. అక్కడ రేణుక చౌదరి కాంగ్రెస్ నేతగా కనిపిస్తున్నా…కాంగ్రెస్సే కావాలని కమ్మవర్గాల్లో చిచ్చుపెట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నా.. బీఆర్ఎస్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలన్న లక్ష్యంతోనే కమ్మ సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారన్న వెర్షన్ గట్టిగా ప్రచారంలోకివచ్చినా…ఇది కచ్చితంగా తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే సీరియస్ అంశంగానే చూడాలన్నది విశ్లేషకుల నుంచి వస్తున్నమాట. 20 లక్షల ఓట్లంటే సామాన్యమైన విషయం కాదు. కమ్మ సామాజిక వర్గం అంటే అంగ. అర్ధబలం బలంగా ఉన్న సామాజిక వర్గం. అలాంటి వర్గాన్ని నెగ్లెట్ చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ప్రతి పార్టీకి, నేతకూ తెలుసు. అందుకే కమ్మ సామాజిక వర్గం డిమాండ్లను విని ఊరుకోవడంలేదు ప్రధాన పార్టీలు. వారి డిమాండ్‌కు తగ్గ సీట్ల కేటాయింపు ఎంతవరకు సాధ్యం అన్నదానిపైనా సీరియస్‌గా ఆయా పార్టీలు ఆలోచిస్తున్నాయన్న చర్చా జరుగుతోంది. ఇదేమీ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన అసహనం కాదు. రాజకీయంగా తమను ఎదగనీయడంలేదన్న భావన కమ్మ వర్గాల్లో రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు రాజకీయాల్లో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే తమ ఉనికి నామామాత్రంగా మారుతుందన్న భయం కమ్మనేతల్లో కనిపిస్తోంది. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత కమ్మలకు రాజకీయంగా మాంచి పట్టుదొరికింది. అప్పట్నుంచి మన తెలుగు రాష్ట్రంలో రాజకీయంగా కమ్మ వర్గానికి బలం బలగం పెరుగుతూ వచ్చింది. అయితే విభజన తర్వాత ఏపీలో రెడ్ల ఆధిపత్యం క్రమంగా పెరగడం.. ఇటు తెలంగాణలో వెలమ సామాజిక వర్గానికి అధికారం చేజిక్కడంతో…కమ్మ కాస్త వెనకబడింది. ఇదే కొనసాగితే తాము మరింత వెనకబడిపోతామన్న ఆందోళన కమ్మనేతల్లో కనిపిస్తోంది. వారి మాటల్లో వినిపిస్తోంది. బీఆర్ఎస్ వెలమ చేతుల్లోకి వెళ్లినా…రెడ్లకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం కమ్మ వర్గాల్లో అసంతృప్తిని పెంచిందన్నది విశ్లేషకుల మాట. ప్రధాన పార్టీలన్నీ రెడ్లకే ప్రాధాన్యత ఇస్తున్నాయన్న అసహనం వారిలో రోజరోజుకూ పెరగసాగింది. ఈనేపథ్యంలో తెలంగాణలో కమ్మ సామాజికవర్గం ఓటు బ్యాంకు ఈసారి ఏ పార్టీకి వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ అంశం కూడా ఇక్కడ కీలకంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని అధికారపార్టీలు రెండూ చంద్రబాబును కుట్రతోనే అరెస్ట్ చేయించారన్న భావన ఆ వర్గాల్లో వ్యక్తమవుతోంది. చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శనలు చేసిన ఐటీ ఉద్యోగులపై పోలీసు చర్యలు తీసుకోవడం నెగెటివ్‌గా మారిందా అన్న చర్చ కూడా జరుగుతోంది. చంద్రబాబు అరెస్టు పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడంతో కమ్మ ఓటర్లలో సందేహాలకు తావిచ్చినట్లైంది. అయితే ఈ విషయం త్వరగా గుర్తించిన బీఆర్ఎస్.. దివంగత సీఎం ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంద‌రికీ ఎన్టీఆర్ ఆరాధ్య దైవం.. ఎవ‌రు ఎన్ని చ‌రిత్రలు రాసినా కొన్ని చెరిగిపోని స‌త్యాలు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పింది ఎన్టీఆర్ మాత్రమే అంటూ మంత్రి కేటీఆర్ పొగడ్తలు కురిపించారు. ఖమ్మం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఎన్టీఆర్ పేరు ద్వారా వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారన్నది బీఆర్ఎస్ ప్రత్యర్థుల నుంచి వస్తున్న విమర్శలు. అక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ సామాజికవర్గ ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి ఎన్టీఆర్ పేరును తెరమీదకు తీసుకురావాల్సి వచ్చిందనే చర్చ ఇప్పటికే మొదలైంది. అలాగే చంద్రబాబు అరెస్ట్‌పై ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల్లోనూ పెద్ద చర్చే జరుగుతోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :