జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విభిన్న కుటుంబ కథాచిత్రాలతో పాటు ప్రజలకు సామాజిక స్పృహ కలిగించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారన్నారు. నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరోగా, సూపర్ స్టార్‌గా సొంతం చేసుకున్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.సొంత నిర్మాణ సంస్థ స్థాపించి సినిమా రంగంలో నూతన ఒరవడులను ప్రవేశపెట్టిన ఘనత కృష్ణదేనని కేసీఆర్ కొనియాడారు.
Admin