Saturday, 18 May 2024 12:36:38 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తెలంగాణలో కలిసి పోటీ చేయనున్న బీజేపీ-జనసేన..! కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పవన్‌ కల్యాణ్‌ చర్చలు..

Date : 25 October 2023 09:43 PM Views : 65

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ ఎన్నికల రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అమిత్‌షా బహిరంగసభ జరిగే 27నే ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అంటూ పార్టీ వీడిన రాజగోపాల్‌ రెడ్డి.. ఇప్పుడు అధికారపార్టీకి కాంగ్రెస్‌ పార్టీయే సరైన ప్రత్యర్ధి అంటున్నారు. మరోవైపు ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఉమ్మడి కార్యాచరణతో వెళుతున్న జనసేనతో కలిసి ప్రయాణం చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేదానిపై రెండు పార్టీల అగ్రనేతలు సమావేశమయ్యారు. ఎవరికి వారే యుమునా తీరే అన్నట్టుగా ఉన్న బీజేపీ, జనసేన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ దగ్గరయ్యాయి. కలిసి పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. పొత్తుకు తుది రూపు ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. చర్చల్లో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చిన పవన్‌ కల్యాణ్ వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జనసేన PAC చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా ఉన్నారు. జనసేన ఎన్డీఎలో భాగస్వామి కాబట్టి ఆ పార్టీతో చర్చలు జరుపుతున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కనీసం 20 స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన ఆసక్తి కనీసం 32 స్థానాల్లో పోటీ చేయాలన్నది తెలంగాణ జనసేన ఆకాంక్ష. కాని, ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 20 స్థానాలు తమకు కేటాయించాలని ఆ పార్టీ బీజేపీని కోరుతోంది. ఈ మేరకు తమ ప్రతిపాదనను బీజేపీ పెద్దల ముందు బీజేపీ ఉంచినట్టు తెలుస్తోంది. నవంబర్‌ ఒకటి తర్వాత బీజేపీ రెండో జాబితా నవంబర్‌ ఒకటిన జరిగే CEC సమావేశం తర్వాత తెలంగాణకు సంబంధించి రెండో జాబితాను బీజేపీ విడదల చేయనుంది. అన్ని స్థానాలకు అభ్యర్థుల పేర్లను తాము కమిటీ ముందుంచుతామని, అందులో ఎన్ని పేర్లకు కమిటీ ఆమోదం తెలుపుతుందో చూడాలని కిషన్‌రెడ్డి తెలిపారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :