Saturday, 18 May 2024 09:22:42 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న హైకోర్టు మహిళ జడ్జిలు

Date : 21 October 2023 08:41 AM Views : 71

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే బతుకమ్మ వేడుకలు నాంపల్లి కోర్టులో ఘనంగా జరిగాయి. నాంపల్లి బార్ అసోసియషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిధిలుగా మహిళా జడ్జిలు హాజరు అయ్యారు. మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన జస్టిస్ జువ్వడి శ్రీదేవి, జస్టిస్ శ్రీ సుధా, జస్టిస్ సురేపల్లి నంద, మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి ప్రేమావతి బతుకమ్మ పాటలు స్వయంగా పాడుతూ కోలాటమాడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు ఆటపాటలతో సంబరాలు చేశారు. కోర్టు భద్రతను పర్యవేక్షించే SPF సిబ్బందితో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాలు సందర్భంగా ఉత్తమంగా డ్యాన్స్ చేసిన ఉద్యోగినులకు బహుమతులు ప్రదానం చేశారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మహిళా ఐపీఎస్‌లు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళ ఐపీఎస్‌లతో పాటు మహిళా పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. దీంతో ప్రతి ఏటా ప్రభుత్వ కార్యాలయాలను మొదలుకొని ప్రైవేటు సంస్థల దాకా అన్నింటిలోనూ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళ ఐఏఎస్, ఐపీఎస్‌లు వివిధ కోర్టుల మహిళా జడ్జిలు, మహిళా మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ప్రజలతో మమేకమై బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటూ తెలంగాణ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. నాంపల్లి కోర్టులో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో హైకోర్టు జడ్జీలు పాల్గొన్న కార్యక్రమం ఆధ్యాంతం అందరినీ ఆకట్టుకుంది. నిరంతరం న్యాయవ్యవస్థలో బిజీగా గడిపే జడ్జిలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని అందరిని ఆకట్టుకున్నారు. గౌరవప్రదమైన న్యాయవ్యవస్థలో నిరంతరం తీర్పులు వెల్లడించే.. మహిళ న్యాయమూర్తులు తెలంగాణ సంప్రదాయాన్ని అనుసరించి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం విశేషం. తెలంగాణ మహిళా న్యాయమూర్తులు పాల్గొన్న ఈ సంబరాల్లో పెద్ద ఎత్తున నాంపల్లి కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :