Saturday, 18 May 2024 01:59:48 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్.. ఈ విషయాలు తెలుసుకోండి

Date : 10 October 2023 09:21 AM Views : 71

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అధికారికంగా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నిన్నటి వరకు ఓ లెక్క.. ఇక మీదట మరోలెక్క. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో కోడ్‌ కొరడాను కఠినంగా అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రకటించారు. నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకొని వ్యవహరించాలని రాజకీయ పార్టీలను CEO కోరారు. రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్.. ఈ విషయాలు తెలుసుకోండి తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం సోమవారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆ వెంటనే ఎన్నికల అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వపరంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎటువంటి చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ వెబ్‌సైట్లలో మంత్రుల ఫొటోలు తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను అర్థం చేసుకోవాలని CEO వికాస్‌ రాజ్‌ రాజకీయ పార్టీలను కోరారు. సంక్షేమ పథకాల అమల్లో గతంలో ఉన్న నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు తమ ప్రకటనలకు సంబంధించి ముందుగా ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాలి CEO సూచించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌స్పీకర్లపై నిషేధం ఉంటుందని తెలిపారు. ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకెళ్లే వారు వాటికి సంబంధించిన పత్రాలను కచ్చితంగా చూపాలని అన్నారు. డ్రగ్స్‌, మద్యం, నగదు తరలింపుపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ల సౌకర్యార్థం ఈసారి EVMలపై పార్టీ గుర్తులతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఫొటో కూడా ఉంటుందని చెప్పారు. పోలింగ్ రోజున వికలాంగులు (పిడబ్ల్యుడి), సీనియర్ సిటిజన్‌లకు పోలింగ్ బూత్‌లకు రవాణా సౌకర్యం కల్పిస్తామని, ఈ ఎన్నికల్లో తొలిసారిగా సీనియర్ సిటిజన్లు, పిడబ్ల్యుడి ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఫ్లయింగ్‌ స్క్వాడ్స్ రంగంలోకి దిగాయి. రాష్ట్రంలో తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. గరిష్టంగా ఒక పోలింగ్‌ స్టేషన్‌లో 1500 మంది ఓటర్లు ఉండేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. దీని కోసం పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను కూడా పెంచుతున్నట్టు తెలిపింది. 2018 ఎన్నికల్లో తెలంగాణలో 32,812 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా ఈసారి ఆ సంఖ్య 35,356కు పెరగనుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటే చాలా నియమనిబంధనలు ఉంటాయి. ప్రభుత్వం ఏం చేయాలి? ఏం చేయకూడదు…అనేవాటిపై సవాలక్ష నిబంధనలుంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం… అధికారిక పనులకు తప్ప ఇతర పనులకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడకూడదు అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు కలిపి నిర్వహింకూడదు పార్టీ పరమైన అంశాలకు ప్రభుత్వ వాహనాలు ఉపయోగించకూడదు కాన్వాయ్‌లో 3కంటే ఎక్కువ వాహనాలు ఉంటే ఎన్నికల వ్యయం కింద చూపించాలి ఈ రోజు నుంచే ఎన్నికల జమ ఖర్చులు కూడా అమల్లోకి! అన్ని పార్టీలకూ అందుబాటులో వసతి గృహాలు, సభాస్థలాలు, హెలిప్యాడ్‌లు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల యాడ్స్‌ నిషేధం ప్రభుత్వపరంగా ఇవ్వాల్సి వస్తే ఈసీ అనుమతి తప్పనిసరి ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులకు నో కొత్త పథకాల ప్రకటన పూర్తిగా నిషేధం

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :