Saturday, 18 May 2024 10:51:47 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Telangana: ఇకపై రోజుకో వెరైటీ.. బడి పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ మెనూ ఇదే.. పూర్తి వివరాలు..

Date : 05 October 2023 08:48 PM Views : 76

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న మరో పధకం 'ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం పథకం'. అక్టోబర్ 6వ తేదీ శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ ఈ పధకాన్ని ప్రారంభించనున్నారు. దీని ద్వారా ఇకపై రాష్ట్రమంతటా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ఉచితంగా బ్రేక్ ఫాస్ట్ పెట్టనుంది కేసీఆర్ సర్కార్. మరి ఈ బ్రేక్ ఫాస్ట్ మెనూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. Telangana: ఇకపై రోజుకో వెరైటీ.. బడి పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ మెనూ ఇదే.. పూర్తి వివరాలు.. హైదరాబాద్, అక్టోబర్ 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న మరో పధకం ‘ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం పథకం’. అక్టోబర్ 6వ తేదీ శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ ఈ పధకాన్ని ప్రారంభించనున్నారు. దీని ద్వారా ఇకపై రాష్ట్రమంతటా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ఉచితంగా బ్రేక్ ఫాస్ట్ పెట్టనుంది కేసీఆర్ సర్కార్. ప్రతీ స్కూల్‌లోనూ ఉదయం 8 గంటల నుంచే అల్పాహారం పెట్టనున్నారు. ఇలా వారంలో ఆరో రోజుల పాటు విద్యార్ధులకు బ్రేక్ ఫాస్ట్ పెడతారు అధికారులు. మరి రోజూవారీగా ఉన్న వెరైటీలు ఏంటి.? అలాగే బ్రేక్ ఫాస్ట్ మెనూ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు అందించే బ్రేక్ ఫాస్ట్ మెనూ.. సోమ‌వారం – ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ ర‌వ్వ ఉప్మా, చ‌ట్నీ మంగ‌ళ‌వారం – పూరి, ఆలు కుర్మ లేదా ట‌మాటా బాత్ విత్ ర‌వ్వ, చ‌ట్నీ బుధ‌వారం – ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చ‌ట్నీ గురువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగ‌ల్, సాంబార్ శుక్రవారం – ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చ‌ట్నీ లేదా గోధుమ ర‌వ్వ కిచిడీ, చ‌ట్నీ శ‌నివారం – పొంగ‌ల్/సాంబార్ లేదా వెజిట‌బుల్ పొలావ్, రైతా/ఆలు కుర్మ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు ప్రతీ రోజూ పౌష్టికాహారం అందించే దిశగా సీఎం కేసీఆర్.. ఈ నూతన పధకాన్ని అమలులోకి తీసుకొస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ప్రతీ స్కూల్.. ఉదయం 8.45 గంటలకు మొదలై.. మధ్యాహ్నం 3.45 గంటలకు పూర్తవుతుంది. ట్విన్ సిటీలు మినహా రాష్ట్రంలోని మిగిలిన స్కూల్స్ ఉదయం 9.30 గంటలకు స్టార్ట్ అయ్యి.. సాయంత్రం 4.15 గంటలకు పూర్తవుతాయి. అలాగే స్కూల్ మొదలయ్యే 45 నిమిషాలు ముందుగా స్టూడెంట్స్‌కు బ్రేక్ ఫాస్ట్ పెట్టడం మొదలుపెడుతారు. విద్యార్ధుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పోషకాహార లోపాన్ని పరిష్కరించేందుకు ఈ పధకాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ అల్పాహార పధకం అమలులోకి వస్తే.. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావడం, డ్రాపౌట్‌లు తగ్గడం లాంటివి కూడా మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతీ రోజూ పౌష్టిక అల్పాహారం విద్యార్ధులకు అందేలా పాఠశాల స్థాయిలో హెడ్ మాస్టర్, మండల స్థాయిలో మండల నోడల్ అధికారి, జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షించనున్నారు. పంచాయతీరాజ్‌, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు పాఠశాలలను ఎప్పటికప్పుడు సందర్శించి ఈ పథకం సరిగ్గా అమలయ్యేలా చూసుకుంటారు. కాగా, ఈ పథకాన్ని దసరా కానుక ప్రవేశపెట్టాలని ముందుగా రాష్ట్ర ప్రభుత్వం భావించింది.. అయితే అక్టోబర్ 16న ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుండటంతో.. అక్టోబర్ 6వ తేదీనే ఈ స్కీంను అమలు చేస్తోంది కేసీఆర్ సర్కార్.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :