Saturday, 18 May 2024 11:19:41 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

అసెంబ్లీ ఇన్చార్జిలకు దిశా నిర్దేశం చేసిన కేటీఆర్

Date : 13 October 2023 12:20 PM Views : 67

జై భీమ్ టీవీ - తెలంగాణ / : భారత రాష్ట్ర సమితి ఈరోజు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిల తొలి విడత జాబితాను విడుదల చేసింది. 54 నియోజకవర్గాలకుగాను పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులను ఆయా అసెంబ్లీల ఇన్చార్జిలుగా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు ఇన్చార్జిలుగా నియమించడం జరిగింది. పార్టీ ఇన్చార్జిలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు వీరికి దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో భారత రాష్ట్ర సమితికి అద్భుతమైన సానుకూల వాతావరణం ఉన్నదని కేటీఆర్ అన్నారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్ధానంలో నిలిపేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు ముమ్మాటికి బ్రహ్మరథం పడుతున్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈరోజు పార్టీ నియమించిన అసెంబ్లీల ఇన్చార్జిలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపైన పార్టీ ఇంచార్జీలకు దిశానిర్దేశం చేశారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని ఓట్లు అడగాలని, ఇందుకోసం 10 సంవత్సరాలలో బిఅర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రతి ఇంటి గడపకు తీసుకువెళ్లాలని పార్టీ ఇన్చార్జిలకు కేటీఆర్ సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికలు కేవలం హామీలు ఇచ్చేందుకు వేదికలు మాత్రమే అని బిఆర్ఎస్ పార్టీకి మాత్రం 10 సంవత్సరాలలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించే ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. గత పది సంవత్సరాలుగా బిఅర్ఎస్ పార్టీ పాలనలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకం కావాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ రోజు అసెంబ్లీల వారీగా ఇన్చార్జీలుగా నియమించిన ప్రతి ఒక్క నాయకుడు ఇప్పటినుంచే పార్టీ విజయానికి అవసరమైన కార్యాచరణను, కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత వీరి పైననే ఉంటుందని, రేపటి నుంచి ఎన్నికలు ఫలితాలు వెలువడే రోజు వరకు ఆయా నియోజకవర్గాల సంపూర్ణ బాధ్యతను వీరు తీసుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులు అన్నింటిని సమన్వయం చేసుకొని పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు పార్టీ ఇంచార్జ్‌లకు పలు సలహాలు, సూచనలు అందించారు. రానున్న 45 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల నిర్వహణ మొదలుకొని నియోజకవర్గ స్థాయి వరకు అన్ని దశల్లో పార్టీ ప్రచారం పకడ్బందీగా ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు. ఇన్చార్జిలుగా కార్యకర్తలు చేపట్టాల్సిన కార్యక్రమాలపైన ప్రత్యేకంగా మాట్లాడారు. తమకు బాధ్యత అప్పజెప్పిన కార్యక్షేత్రంలో గత పది సంవత్సరాలలో జరిగిన మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు పోవాలని సూచించారు. ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని తెలిపిన హరీష్ రావు ఆ దిశగా ఈ 45 రోజులపాటు విస్తృతంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :