Saturday, 18 May 2024 11:19:46 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మంగళవారం తగ్గిన బంగారం ధర.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా.?

Date : 21 November 2023 09:11 AM Views : 67

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలో కాస్త స్థిరత్వం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప తగ్గడం లేదన్నట్లు పెరుగుతూ పోయిన గోల్డ్‌ ధరలు తాజాగా కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. గడిచిన రెండు రోజుల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగగా.. ఈరోజు గోల్డ్‌ ధరలో తగ్గుదల కనిపించింది. అయితే స్వల్పమేనని చెప్పాలి. ఇటు 22 క్యారెట్ల బంగారంపై, 24 క్యారెట్ల బంగారంపై రూ. 50 మేర తగ్గింది. దీంతో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640గా ఉంది. మరి దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,790 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 56,500కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640గా ఉంది. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,050కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,230 వద్ద కొనసాగుతోంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640గా ఉంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,640 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,640గా ఉంది. ఇక నిజామాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,500కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్‌ రూ. 61,640 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఓవైపు బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపిస్తే.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా లాంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 76,000గా ఉంది. అయితే చెన్నైలో మాత్రం అత్యధికంగా రూ. 79,000గా ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,000 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 79,000 వద్ద కొనసాగుతోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :