Saturday, 18 May 2024 11:19:37 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

పొలింగ్, కౌంటింగ్ తేదీలు కూడా కలిసివచ్చేలా ఉన్నాయ్: కేటీఆర్

Date : 10 October 2023 09:20 AM Views : 89

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పోలింగ్, ఫలితాల తేదీల ప్రకారం కేసీఆర్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని ఆ పార్టీ దృఢంగా నమ్ముతుంది.. ఏకంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే లెక్క కుదిరిందని స్వయంగా ప్రకటించారు. కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారం పోలింగ్ తేదీ 30, కౌంటింగ్ డేట్ 03 కలిపితే 06 నెంబర్ రావడం శుభసూచకం అన్నారు.. లెక్క కుదిరింది.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది.. కేసిఆర్ మూడో సారి సీఎం అవడం ఖాయమని ధీమాను ప్రదర్శించారు. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని…కేసిఆర్ ఢిల్లీ పీఠాన్ని శాసించే ఎన్నికలని ఆయన తెలిపారు. కేసీఆర్ హ్యాట్రిక్ విక్టరీ సాధిస్తే పక్క రాష్ట్రాల్లో పట్టు సాధించడంతోపాటు ఢిల్లీ పీఠాన్ని కూడా శాసించవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… భూపాలపల్లి, పరకాల, పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూర్ లో మూడు బహిరంగ సభలో పాల్గొన్నారు.. పార్టీ శ్రేణులను ఉత్తేజ పరిచేలా ప్రసంగించిన ఆయన బీఆర్‌ఎస్ పార్టీ హ్యాట్రిక్ విక్టరీ సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా బీఆర్ఎస్ పార్టీ పక్కనున్న మహారాష్ట్ర, ఇతర పొరుగు రాష్ట్రాలలో కూడా పట్టు సాధిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మనకు శ్రీరామరక్ష అన్నారు.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వచ్చినట్లే వస్తుంటారని ఎద్దేవా చేశారు. అమెరికా డాలర్లతో కొంతమంది దిగుతున్నారని.. వారి వద్ద డాలర్లు తీసుకోండి.. వారిచ్చే డబ్బులు తీసుకొండి.. ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేటీఆర్. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత.. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం పక్కా అంటున్నారు మంత్రి కేటీఆర్. ఎలక్షన్ తేదీ, కౌంటింగ్ తేదీలు కూడా కలిసివచ్చేలా ఉన్నాయన్నారు. కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారం సిక్స్ వర్క్ అవుట్ అవుతుందని ఇక మూడోసారి విక్టరీ ఖాయమని ధీమాను ప్రదర్శించారు. నవంబర్ 30వ తేదీన పోలింగ్.. డిసెంబర్ 03 తేదీన కౌంటింగ్… టోటల్ 3+3 = 6 కేసిఆర్ లక్కీ నెంబర్ రావడం వల్ల కేసీఆర్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని అన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవడాన్ని ఎవరు అడ్డుకోలేరని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ట్రాక్ రికార్డ్, కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ మీ ముందుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. కేసీఆర్ జబర్దస్త్‌గా ఉన్నారన్న మంత్రి కేటీఆర్‌.. ఇవ్వాల్సిన హామీలపై కసరత్తు చేస్తున్నారన్నారు.. రేపోమాపో బయటకివచ్చి అన్నీచెబుతారన్నారు.‌

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :