Saturday, 18 May 2024 10:28:10 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ప్రచారంలో ఉండగా మట్టిపెళ్లతో దాడి.. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి

Date : 14 November 2023 12:37 PM Views : 89

జై భీమ్ టీవీ - తెలంగాణ / : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఎన్నికల వేళ పార్టీల అభ్యర్థుల పై దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 11వ తేదీన అచ్చంపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణలో గువ్వల బాలరాజు పై రాయి దాడి సంచలనం రేపింది. అది జరిగి రెండు రోజులు కాకముందే మరోసారి మట్టిపెళ్లతో దాడి కలకలం సృష్టించింది. మరోమారు దాడి.. ఇటీవలే జరిగిన దాడి అనంతర బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది నియోజకవర్గానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమ్రబాద్ మండలం కమ్మరోనిపల్లిలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గువ్వల బాలరాజు వైపు ఓ మాట్టిపెళ్ళ దూసుకువచ్చింది. ఆయన మోచేతిని తాకుతూ కింద పడింది. ఈ ఘటనలో గువ్వల బాలరాజుకు స్వల్ప గాయం అయ్యింది. దాడి జరిగిన ఆనంతరం తన ప్రచారాన్ని గువ్వల కొనసాగించారు. ఆయనకు తాకిన మట్టిపెళ్లను అందరికీ చూపించారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి గుర్తింపు.. ఇక దాడి అనంతరం నిందితుడిని పట్టుకునేందుకు సమయం పట్టింది. చుట్టూ వందల మంది పార్టీ కార్యకర్తలు ఉండడం, చీకటి కావడంతో దాడికి పాల్పడ్డ వ్యక్తిని గుర్తించేందుకు సమయం పట్టింది. చివరకు ఓ వ్యక్తి పరుగున వెళ్లి ఇంట్లో గడియ పెట్టుకున్నాడు. ఆ వ్యక్తిని వెంబడించిన కార్యకర్తలు అదుపులోకి తీసుకోవాలని చూశారు. తీరా మట్టిపెళ్ళ విసిరిన వ్యక్తి మతి స్థిమితం లేని అదే గ్రామానికి చెందిన వ్యక్తి పర్వతాలు‌గా నిర్దారణ అయ్యింది. వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ అధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ సైతం నిర్వహించారు. అభ్యర్థుల ప్రచారం ఊపందుకోనున్న నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత చర్యలు చేపడుతున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :