Saturday, 18 May 2024 10:08:42 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

దోపిడీ స్కాంల ప్రభుత్వాన్ని గద్దె దించాలి, లిక్కర్ స్కాంపై శ్వేతపత్రం విడుదల చేయాలి

- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

Date : 22 December 2022 10:07 PM Views : 201

జై భీమ్ టీవీ - తెలంగాణ / పెద్దపల్లి జిల్లా : పెద్దపెల్లి : (జై భీమ్ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్రంలో పాలిస్తున్న దోపిడీ స్కాంల ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాలని డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 150వ రోజు యాత్ర పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదెల మండలంలో కొనసాగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో దోపిడి పెరిగిందన్నారు. ధరణి పోర్టల్ తీసుకువచ్చి సమస్యలు సృష్టించారని తెలిపారు.సమస్యలు పరిష్కరించాలని స్లాట్ బుక్ చేసుకుంటే వేలకు వేలు ఫీజు కట్టాల్సి వస్తుందని,స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే మన ఫీజు వాపస్ ఇవ్వడం లేదని,ప్రభుత్వం ఈ విధంగా ప్రజలను పీల్చి పిప్పి చేస్తుందని,ఆదాయం పెంచుకుంటుందని ధ్వజమెత్తారు.ధరణి పోర్టల్ తీసుకువచ్చిందే భూముల కబ్జా కోసం అని విమర్శించారు.బహుజన రాజ్యంలో ధరణి పోర్టల్ తొలగిస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లిలోని ఓదెల మండలం లంబాడతండాలో వంద ఎకరాల భూమి ధరణిలో చూపించడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.కవిత లిక్కర్ స్కాం పై పూర్తి వివరాలు బయటపెట్టాలని,శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.వందకోట్లు ఎలా వచ్చాయి,సెల్ ఫోన్ ఎందుకు ధ్వంసం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.ఢిల్లీలో ఆప్,బిఆర్ఎస్ కలిసి లిక్కర్ మాఫియా నడుపుతున్నారని ఆరోపించారు.బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని తొలగించి,పేదల హక్కులను కాలరాయాలని చూస్తుందని పేర్కొన్నారు. మైనారిటీలకు ఓటు హక్కు తీసేసే కుట్ర జరుగుతుందని తెలిపారు.తెలంగాణ సిఎం కెసిఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారని గుర్తుచేశారు.రాజ్యాంగం తీసేస్తే మనకు హక్కులుండవని,అందుకే బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే రాజ్యాంగాన్ని కాపాడడం కోసం కృషి చేస్తుందని తెలిపారు.రాజ్యసభలో కేంద్రమంత్రి స్వయంగా రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని చెబుతుంటే,తెలంగాణ ప్రభుత్వం బిసి,ఎస్సీ,ఎస్టీ మైనారిటీల రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ఓదెల మండలంలో ఇసుక మాఫియా పెరిగిందని,దానివల్ల రోడ్లు పాడైపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలకు రైల్వే ట్రాక్ వల్ల ఎమర్జెన్సీ సమయంలో ఇబ్బందులు పడుతున్నారని,ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు.ఎస్ఆర్ఎస్ పి కాలువ నీళ్లు ప్రతి గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీస్ నియామకాల్లో లాంగ్ జంప్ 3.8 మీటర్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు.ఆసరా ఫించన్ల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని,మిషన్ భగీరథ నల్లాల గుండా కలుషిత నీరు వస్తుందని మండిపడ్డారు.యాత్రలో భాగంగా కొత్తపల్లి గ్రామ శివారులోని హమాలీలు,నాట్లు వేసే మహిళలను కలిసి బహుజన రాజ్యం గురించి వివరించారు. బహుజన రాజ్యంలో పేదలందరికీ సమానంగా సంపద పంచుతామని,సమాన అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి హనుమయ్య,నియోజకవర్గ ఇంచార్జి దాసరి.ఉష,జిల్లా అధ్యక్షులు దుర్గయ్య,జిల్లా మహిళా కన్వీనర్ స్వప్నగౌడ్,నియోజకవర్గ నాయకురాలు శారద తదితరులు పాల్గొన్నారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :