Saturday, 18 May 2024 01:59:57 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

సర్పంచ్ ​ఆత్మహత్య : కట్టించిన శ్మశానవాటికలో.. ఆయనదే తొలి దహన సంస్కారం

Date : 03 May 2023 11:17 AM Views : 148

జై భీమ్ టీవీ - తెలంగాణ / వరంగల్ జిల్లా : పరకాల : ఓ గ్రామ సర్పంచ్ గా కొత్తగా కట్టించిన శ్మశాన వాటిక ఆయన దహన సంస్కారలతోనే మొదలైంది. ఈ దురదృష్టకరమైన ఘటన హన్మకొండ జిల్లా పరకాల మండలంలో చోటుచేసుకుంది. హైబోత్​పల్లిలో అప్పుల పాలై కుటుంబ కలహాలు ఏర్పడి.. భార్య పుట్టింటికి వెళ్లడంతో కలత చెందిన ఓ సర్పంచ్​ ఉరి వేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం..కొద్ది రోజుల కింద సర్పంచ్​ కంచ కుమారస్వామి (35)కి ఆయన భార్యకు గొడవ జరగడంతో పుట్టింటికి వెళ్లింది. ఐదు రోజుల కింద అత్తగారింటికి వెళ్లి కాపురానికి రావాలని అడగ్గా ఆమె అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురై శనివారం సాయంత్రం చేనువద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. తర్వాత తన పెద్ద కొడుక్కి సమాచారం ఇచ్చాడు. మృతుడి తల్లి, కుటుంబసభ్యులు అక్కడకు వచ్చి పరకాల దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. కాగా, సర్పంచ్​ ఆత్మహత్యకు మరికొన్ని కారణాలున్నాయని గ్రామస్తులంటున్నారు. కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటులో భాగంగా వెంకటాపురం శివారు గ్రామం హైబోత్​పల్లి ఏర్పడడంతో గ్రామస్తులు కుమారస్వామిని ఏకగ్రీవంగా సర్పంచ్​గా ఎన్నుకున్నారు. దీంతో గ్రామాభివృద్ధి కోసం కష్టపడ్డాడు. వివిధ అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.24 లక్షల వరకు అప్పు చేశాడని సమాచారం. డంప్​ ​యార్డు, శ్మశానవాటిక పనుల కోసం డబ్బులు పెట్టుకోగా, ఆ బిల్లులు రాలేదని అందుకే అప్పుల పాలయ్యాడని గ్రామస్తులంటున్నారు. ఈ క్రమంలో కుటుంబంలో గొడవలు జరిగి భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. అతడి కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :