Saturday, 18 May 2024 10:28:08 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రేపు కరీంనగర్​లో కాంగ్రెస్ సభ

హాజరవనున్న చత్తీస్​గఢ్ సీఎం భూపేశ్, జైరాం రమేశ్, 23 షరతులతో సభకు పోలీసుల పర్మిషన్

Date : 08 March 2023 07:36 AM Views : 149

జై భీమ్ టీవీ - తెలంగాణ / కరీంనగర్ జిల్లా : హైదరాబాద్ : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ఈ నెల 9న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్​లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ సభకు చత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ హాజరుకానున్నారు. రేవంత్ రెడ్డి ‘యాత్ర ఫర్ చేంజ్’ పాదయాత్రలో భాగంగా ఈ సభ నిర్వహించాలని నిర్ణయించారు. హోలీ, వుమెన్స్ ​డే నేపథ్యంలో మంగళవారం, బుధవారం యాత్రకు విరామమిచ్చిన రేవంత్​..మళ్లీ 9న యాత్ర ప్రారంభించనున్నారు. కరీంనగర్ సభకు పోలీసులు 23 షరతులతో కూడిన పర్మిషన్​ఇచ్చారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సభ నిర్వహించుకునే అవకాశం ఇచ్చారు. సభకు 50 వేల మందికి అనుమతినివ్వాలని పార్టీ నేతలు కోరగా.. సిటీ ఏసీపీ మాత్రం కేవలం 15 వేల మందికి పర్మిషన్ ఇచ్చారు. అంబేద్కర్ స్టేడియం 50 వేల మందికి సరిపోదని, ఎక్కువ మందికి అనుమతిస్తే తొక్కిసలాట వంటి ఘటనలు జరిగే ప్రమాదముందని నిరాకరించారు. సభలో డీజే సౌండ్ సెటప్స్ వాడరాదని, సభ తర్వాత ర్యాలీలు తీయొద్దని, ట్రాఫిక్​కు ఆటంకం కలిగించొద్దని పేర్కొన్నారు. డ్రోన్​ కెమెరాలనూ వాడరాదని స్పష్టం చేశారు. పార్టీనే గ్రౌండ్​లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. పటాకులు కాల్చొద్దని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సభను నిర్వహిస్తే వెంటనే అనుమతిని రద్దు చేస్తామని హెచ్చరించారు.​

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :