Saturday, 27 July 2024 12:42:11 PM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

టార్గెట్ తెలంగాణ.. ఇవ్వాల్టి నుంచి మూడు రోజుల పాటు ప్రధాని మోదీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..

Date : 25 November 2023 08:13 AM Views : 147

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో పోలింగ్‌కి కౌంట్‌డౌన్ దగ్గరపడటంతో ప్రచారపర్వంలో స్పీడు పెంచిన జాతీయ పార్టీలు అగ్రనేతల్ని రంగంలోకి దింపుతున్నాయి. ‘బీజేపీ జెండా-సకల జనులకు అండ’ అనే స్లోగన్‌తో ప్రచారాన్ని పీక్స్‌లో నడిపిస్తోంది కమలం పార్టీ. తెలంగాణ సమగ్రాభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే సాధ్యం అంటూ జాతీయ నేతల్ని రప్పించి విజయసంకల్ప సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తోంది. బీసీ సీఎం నినాదంతో నేటినుంచి హేమాహేమీలు రంగంలోకి దిగనున్నారు. ప్రధాని మోదీ, హోమ్‌మంత్రి అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఇలా అగ్రనేతలంతా తెలంగాణలో పర్యటించనున్నారు. ఇవ్వాల్టి నుంచి మూడురోజుల పాటు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్ దుండిగల్ ఏయిర్ పోర్టుకు రానున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు కామారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు తుక్కుగుడలో బహిరంగ సభ అనంతరం బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని అక్కడనుంచి రాజ్‌భవన్ చేరుకుంటారు. 26న దుబ్బాక, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్‌ నియోజకవర్గాల్లో పర్యటించి.. బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. అయితే.. 26న రాత్రికి తిరుపతి చేరుకుని, 27 ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఈనెల 27 సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్‌షోతో మోదీ తెలంగాణా ఎలక్షన్ టూర్ ముగియనుంది. ప్రధాని మోదీతోపాటు ముగ్గురు బీజేపీ ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ బీజేపీ కోసం ప్రచారం చేయనున్నారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలంగాణలో పర్యటిస్తారు. ఇలా సభలు, సమావేశాలు, ర్యాలీల ద్వారా ఢిల్లీ నేతలతో తెలంగాణ గల్లీల్ని హోరెత్తించాలన్నది బీజేపీ ప్రచార ఎత్తుగడ. ఇలా మొత్తానికి కమలం నేతలు తమ ప్రచార వ్యూహాన్నే మార్చేశారు. అధికార బీఆర్‌ఎస్‌ అవినీతియే లక్ష్యంగా కమలం నేతలు నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. పదేళ్ల BRS పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీసి చర్యలు తీసుకుంటామనే థీమ్‌తో ముందుకెళ్తున్నారు. కాగా.. అగ్రనేతల పర్యటనల నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉండనున్నాయి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :