Saturday, 18 May 2024 11:37:55 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బలవంతంగా అయినా గౌరవం ఇవ్వాల్సి వస్తోంది.. కర్నాటక మంత్రి జమీర్ వివాదాస్పద వ్యాఖ్యలు

Date : 21 November 2023 09:15 AM Views : 88

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్ని కూడా ప్రధాన పార్టీలు వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్ మంత్రి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ దంగల్‌లో దుమారం రేపాయి. కర్నాటక విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్‌.. తెలంగాణ ఎన్నికల్లోనూ అదే సీన్‌ రిపీట్‌ చేయాలని భావిస్తోంది. దీనికోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని.. ప్రచారం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కర్నాటక నేతలను కూడా దింపుతోంది. ఈ క్రమంలో కర్ణాటక నేతలు చేస్తున్న కామెంట్స్‌ వివాదాన్ని రేపుతున్నాయి. అదే సమయంలో ప్రత్యర్ధిపార్టీలకు అస్త్రంగా మారుతున్నాయి. ఇటీవల తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కర్నాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌ యూటీ ఖదీర్‌కి.. బీజేపీ నేతలు బలవంతంగా అయినా గౌరవం ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. ఓ ముస్లింకి బీజేపీ నేతలు నమస్కారం చెబుతున్నారంటే అదంతా కాంగ్రెస్ ఘనతే అంటూ తేల్చి చెప్పారు. కర్నాటక మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. ఈ కామెంట్స్‌పై JDS తీవ్రంగా స్పందించింది. ఓ మంత్రి ఇంతలా దిగజారిపోయి మాట్లాడతారని ఊహించలేదంటూ మాజీ సీఎం హెచ్‌డీ కుమార స్వామి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కొంతైనా జ్ఞానం ఉంటే జమీర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే తన ప్రకటనపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో నష్టనివారణ చర్యలు చేపట్టారు జమీర్ అహ్మద్‌. తాను ముస్లిం వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గౌరవం గురించి మాత్రమే మాట్లాడానని.. ఏ పార్టీ శాసనసభ్యులను అవమానించలేదంటూ పేర్కొన్నారు. మరోవైపు వచ్చేనెల మొదటి వారంలో కర్నాటక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల్లో మంత్రి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారే అవకాశం కనిపిస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :