జై భీమ్ టీవీ - తెలంగాణ / : సంచలనం రేపిన ప్రవళిక ఆత్మహత్య వ్యవహారంలో ఆమె మిత్రుడు శివరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 14న హాస్టల్లో ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రవళిక ఆత్మహత్యపై రాజకీయ పార్టీలు దుమారం రేపాయి. ఎట్టకేలకు ప్రవళిక ఆత్మహత్యకు శివరాం కారణమంటూ పోలీసులు తేల్చేశారు. శివరాంను పూణేలో అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ప్రవళిక ఆత్మహత్య కేసు పై విచారణ కొనసాగుతూనే ఉంది. ఈనెల 14న ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకొని ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడింది. ప్రవళిక ఆత్మహత్య అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో వేలాదిగా చేరుకున్న విద్యార్థి సంఘాలు ప్రవళిక ఆత్మహత్యకు గ్రూప్స్ పరీక్ష కారణం అంటూ నిరసనలు చేపట్టారు. అయితే అదే రోజు ప్రవళిక ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రవళిక ఫోన్ పరిశీలించిన పోలీసులు తన ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషించారు. ఇదే సమయంలో ప్రవళిక గదిలో సూసైడ్ నోట్ సైతం లభ్యమయింది. సూసైడ్ నోట్లో ఎలాంటి కారణము తెలుపలేదు ప్రవళిక.అయితే ప్రవళిక ఫోన్ను పరిశీలించిన పోలీసులు కొన్ని అనుమానాస్పద వాట్సప్ చాటింగ్లను గుర్తించారు. తన మిత్రుడైన శివరాం రాథోడ్ అనే వ్యక్తి తనని దారుణంగా మోసం చేశాడని తన స్నేహితులతో ప్రవళిక పంచుకున్న విషయాన్ని పోలీసులు బహిర్గతం చేశారు. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరికి వేరే అమ్మాయితో వివాహానికి సిద్ధమైన అందుకే ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు మీడియా సమావేశంలో ప్రకటించారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు శివరం వ్యవహారం బయటపడటంతో 174 సెక్షన్ ను మార్చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో శివరాంపై మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక శివరాం కోసం గాలింపు చర్యలో భాగంగా అనేక ప్రాంతాలు వెతికారు పోలీసులు. ప్రవళిక తల్లిదండ్రులు ఇచ్చిన స్టేట్మెంట్లను వాంగమూలంగా పరిగణించిన పోలీసులు శివరాం గురించి వివరాలు రాబట్టారు. మహబూబ్నగర్ ప్రాంతానికి చెందిన శివరాం డిగ్రీ హైదరాబాదులో పూర్తి చేశాడు. కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటూ హైదరాబాద్లోనే ఉన్నాడు. ‘ఏ కూతురు తల్లిదండ్రులకు భారం కాదు’ ఘనంగా కుమార్తెకు విడాకుల ఊరేగింపు నిర్వహించిన తండ్రి శివరాం తల్లిదండ్రులు మాత్రం 20 సంవత్సరాల క్రితమే మహబూబ్నగర్ వదిలి పూణేలో స్థిరపడ్డారు. పూణేలో వ్యాపారం చేసుకుంటూ అక్కడే ఉండిపోయిన తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిన శివరామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివరాం కోసం దాదాపు నాలుగు రోజులపాటు గాలించారు పోలీసులు. ప్రవళిక కు శివరం సీనియర్ గా ఉన్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. ప్రవళిక ఫోన్ లో లభించిన వాట్సాప్ చాటింగ్ తో పాటు ప్రవళిక స్నేహితులు, ప్రవళిక కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ను పరిగణలోకి తీసుకున్న పోలీసులు శివరాంను నిందితుడుగా చేర్చారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తీవ్ర సంచలనం రేపిన ప్రవళిక ఘటన లో శివరాం అరెస్ట్ తో ముగింపు పడుతుందా లేదా చూడాలి.
Admin