Saturday, 18 May 2024 11:19:41 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ప్రజలకు ఉపాధి కల్పించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం: హిమాచల్ సీఎం

Date : 26 May 2023 12:16 AM Views : 155

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ప్రత్యేక రాష్ట్ర కాంక్షను గుర్తించి.. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సుఖిందర్ సుఖు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని ఆయన తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో నిరుద్యోగ యువతకు ఉపాధి కలిపించామన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ సిస్టం అమలు చేస్తామని హామీ ఇచ్చారు సుఖ్విందర్. విలాసవంతమైన జీవితాలు, సంపాదన కోసం కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకోదని చెప్పిన సుఖ్విందర్..లక్షలాది మంది ప్రజలకు ఉపాధి కల్పించాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రధాన మంత్రులు ఇందిరా, రాజీవ్ గాంధీలు ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యారని గుర్తు చేశారు. కాశ్మీర్–కన్యాకుమారీ వరకు అవినీతి, హింసలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని తెలిపారు. దేశ ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా సోనియా గాంధీ పదవీ త్యాగం చేశారని సుఖ్విందర్ కొనియాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారాయన. మండు టెండలో భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు.. రేవంత్, భట్టి విక్రమార్క ఈ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని.. అందరం కలిసి కుటుంబ పాలనను అంతమొందించాలని సుఖిందర్ సుఖు పేర్కొన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :