Saturday, 18 May 2024 10:28:19 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

విచారణకు హాజరుకాలేను.. సమయమివ్వండి.. ఈడీకి పైలట్‌ రోహిత్‌రెడ్డి లేఖ

Date : 19 December 2022 11:51 AM Views : 185

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ రాజకీయాల్లో కర్ణాటక డ్రగ్స్‌ కేసు కలకలం రేపింది. పైలట్‌ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యే క్రమంలో రోహిత్ రెడ్డి.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాశారు. ఈ రోజు విచారణకు హాజరుకానంటూ లేఖలో పేర్కొన్నారు. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కోరారు. ఈనెల 25 వరకు గడువు కావాలంటూ రోహిత్ రెడ్డి లేఖ రాశారు. రోహిత్ రెడ్డికి ఈనెల 16న ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈడీ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి బ్యాంకు సెలవులు ఉన్నాయని రోహిత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కావున, విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 25 వరకు సమయం కావాలని రోహిత్ రెడ్డి లేఖలో వివరించారు. కాగా.. ఇవాళ ఈడీ విచారణకు హాజరవుతానని పేర్కొన్న రోహిత్ రెడ్డి.. సోమవారం ఉదయాన్నే ప్రగతిభవన్‌కు చేరుకుని సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. న్యాయపరమైన అంశాలపై చర్చిస్తున్నారు. ఈడీ నోటీసులు, న్యాయ సలహాలు, తదితర అంశాలపై మాట్లాడుతున్నారు. ఉదయం ఈడీ విచారణకు బయలుదేరిన రోహిత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుకాలం ముగిసింది. విచారణకు వెళ్తున్నానంటూ కామెంట్‌ చేశారు. అయితే, రోహిత్‌రెడ్డికి ఏ కేసులో నోటీసులిచ్చామన్నది వెల్లడించలేదు ఈడీ. దీంతో రోహిత్‌రెడ్డిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి క్వశ్చన్‌ చేస్తారా..? వ్యాపార లావాదేవీలపైన కూడా ప్రశ్నిస్తారా..? అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. PMLA కింద రోహిత్‌రెడ్డికి నోటీసులు జారీ చేసిన ఈడీ..తనతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తీసుకురావాలని ఆదేశించింది. ఆధార్‌, పాస్‌పోర్ట్‌, పాన్‌కార్డ్‌తో పాటు..సేల్‌ డీడ్‌, ఇన్వాయిస్‌ కాపీలు కూడా తేవాలని కోరింది. ఈ క్రమంలో రోహిత్ రెడ్డి.. కేసీఆర్ ను కలవడం.. ఈడీకి విచారణకు హాజరుకాలేనంటూ లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :