Saturday, 18 May 2024 09:42:17 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బంగారం ప్రియులకు ఊరట.. తగ్గిన గోల్డ్ రేట్. తులంపై ఎంతంటే..

Date : 31 October 2023 08:48 AM Views : 72

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరకు మంగళవారం కాస్త బ్రేక్‌ పడింది. గడిచిన కొన్ని రోజులుగా ప్రతీ రోజు బంగారం పెరగడం తప్ప తగ్గడం లేదు. రోజుకు కనీసం రూ. 100 చొప్పున బంగారం ధర పెరుగుతుంది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా రూ. 62 వేలు దాటేసింది. అయితే మంగళవారం మాత్రం పెరుగుతోన్న బంగారం ధరలకు బ్రేక్‌ పడింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 210 తగ్గగా, 24 క్యారెట్ల తులం గోల్డ్‌పై రూ. 230 తగ్గింది. దీంతో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 57,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400వద్ద కొనసాగుతోంది. మరి మంగళవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. * దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 62,550 వద్ద కొనసాగుతోంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,400వద్ద కొనసాగుతోంది. * చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,350కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,560గా ఉంది. * కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 57,200కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400 వద్ద కొనసాగుతోంది. * బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 57,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400గా ఉంది. * ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,400 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. * హైదరాబాద్‌లోనూ బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. ఇక్కడ మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400వద్ద కొనసాగుతోంది. * నిజామాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,400 వద్ద కొనసాగుతోంది. * ఖమ్మంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400గా ఉంది. * ఇక విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం పెరిగింది. మంగళవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో పెరుగుల కనిపించింది. కిలో వెండిపై ఒకేరోజు ఏకంగా రూ. 1000 పెరగడం గమనార్హం. దీంతో కిలో వెండి ధర రూ. 75,600కి చేరింది. ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో కిలో వెండి రూ. 78,500కాగా ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 75,600 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో మంగళవారం కిలో వెండి ధర రూ. 78,500 వద్ద కొనసాగుతోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :