Saturday, 18 May 2024 10:51:46 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రేవంత్‌ టార్గెట్‌గా కాంగ్రెస్‌లో సీనియర్ల తిరుగుబాటు

తమదే ఒరిజినల్‌ కాంగ్రెస్‌ అని ప్రకటన

Date : 18 December 2022 12:55 AM Views : 196

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : సేవ్‌ కాంగ్రెస్‌ నినాదాన్ని ఎత్తుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు. ఒరిజినల్‌ కాంగ్రెస్‌ నేతలం తామేనని.. పార్టీని బతికించుకునే బాధ్యత కూడా తమదేనని క్లియర్‌ కట్‌గా తేల్చేశారు. తమ పంచాయితీ అంతా టీడీపీ నుంచి వలస వచ్చిన నేతలతోనే అని కుండబద్దలు కొట్టారు. కొత్త కమిటీల ఏర్పాటుతో మొదలైన కల్లోలం.. రేవంత్‌రెడ్డితో తాడో పేడో అనే దాకా వెళ్లింది. దీంతో ఈ అసంతృప్తి, అలకల తుపాను ఏ తీరం దాకా వెళ్తుందోనన్న ఆందోళన టీకాంగ్రెస్‌లో మొదలైంది. భట్టి నివాసంలో జరిగిన భేటీకి ఉత్తమ్‌ కుమార్‌, దామోదర రాజనర్సింహా, మధుయాష్కి, జగ్గారెడ్డితో పలువురు సీనియర్లంతా హాజరయ్యారు. వాళ్లందరూ మూకుమ్మడిగా తీసుకున్న నిర్ణయం.. కాంగ్రెస్‌ పార్టీని బతికించుకోవడం. ఎట్ ద సేమ్ టైమ్‌ ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు కమిటీల్లో ప్రాధాన్యం కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు. కమిటీల్లో 108మందికి స్థానం కల్పిస్తే అందులో 54 మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయితీ అంతా ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకి.. వలస వచ్చిన వాళ్లకు మధ్యేనని స్పష్టం చేశారు సీనియర్ నేతలు. అసలు సిసలు సీనియర్లను విస్మరించి.. టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కోవర్టులన్న ప్రచారాన్ని రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ ఖండించకపోవడాన్ని తప్పుబట్టారు జగ్గారెడ్డి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :