Saturday, 18 May 2024 01:41:57 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రాజ్‌ గోపాల్‌ రెడ్డి వ్యూహం మార్చారా.ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు.

Date : 20 October 2023 08:51 AM Views : 94

జై భీమ్ టీవీ - తెలంగాణ / : కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండనున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మునుగోడు నుంచి చేస్తారా.? ఎల్బీ నగర్‌ నుంచి పోటీలో నిలవనున్నారా.? లేదా ఆయన శ్రీతి కూడా పోటీ చేయనున్నారా.? ఇలా రాజ్‌ గోపాల్ రెడ్డి పోటీ చుట్టూ ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి. అటు కాంగ్రెస్‌, ఇటు బీఆర్‌ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల బరిలో నిలిచిపోయాయి. అయితే బీజేపీ మాత్రం తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కొన్ని స్థానాలకు ఎవరు బరిలో ఉంటారు అనే క్లారిటీ ఉన్న చాలా నియోజక వర్గాల్లో ఎవరు పోటీ చేస్తారు అనే స్పష్టత లేదు. సీనియర్‌లు పోటీ చేస్తారా లేదా అనే సందిగ్ధత నెలకొంది. కొందరు నేతలు తాము పలానా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తామని చెబుతున్నారు. ఈటెల రాజేందర్ హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ లో సీఎం పై కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తామని మరి కొందరు అంటున్నారు. ఇక గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. రీసెంట్‌గా జరిగిన బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆయన తాను రెండు చోట్ల పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. మునుగోడు ప్రజలు, ఏల్బీ నగర్ ప్రజలు పోటీ చేయాలని కోరుతున్నారని, ఎక్కడ నుంచి పోటీ చేసిన గెలుస్తానని అన్నారు. అయితే ఎల్బీనగర్ నగర్ నుంచి పోటీ చేస్తానన్న బాంబ్‌ పేల్చడంతో అయన వ్యాఖ్యల పై పార్టీలో, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.. అయన పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం తాను మునుగోడు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఇంతకు రాజ్ గోపాల్ రెడ్డీ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే స్పష్టత తో ఉన్నారా లేక సందిగ్ధత తో ఉన్నారా అనే సందేహం వ్యక్తం అవుతుంది. ఆయన రెండు నియోజక వర్గాల్లో కాలు పెట్టారా అని అనుకుంటున్నారు. లేదంటే ట్విస్ట్ కోసమే అలా మాట్లాడారా అనే చర్చ కూడా జరుగుతోంది. రాజ్ గోపాల్ రెడ్డి ఎల్బీ నగర్‌ నుంచి పోటీలో దిగి.. ఆయన భార్య కోమటి రెడ్డి లక్ష్మినీ మునుగోడు నుంచి పోటీ చేస్తారని మరో మాట కూడా వినిపిస్తోంది. బీజేపీ అభ్యర్థులను ప్రకటించే వరకు ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి. కేంద్ర ఎన్నికల కమిటీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్న ఆశావహులు కోమటి రెడ్డి ప్రకటనతో కంగు తిన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :