జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : గాంధీ భవన్ లో దిగ్విజయ్ సింగ్ ముందే నేతల మధ్య డిష్యూం డిష్యూం జరిగింది. పార్టీలో అంతర్గత గొడవలపై ఓవైపు దిగ్విజయ్ సర్ది చెప్తుంటే.... మరోవైపు నేతలు గొడవ చేశారు. గాంధీ భవన్ కు చేరుకున్న ఓయూ నేతలు మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ పై దాడికి యత్నించారు. సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. సీనియర్ కాంగ్రెస్ జిందాబాద్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. దీంతో మల్లు రవి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా ఆందోళనకు దిగారు నేతలు. కాంగ్రెస్ నేతలు సంయమనం పాటించాలని మల్లు రవి అన్నారు. ఎవరూ బయటకొచ్చి అరవొద్దని..అందరూ ఒకర్నొకరు గౌరవించుకోవాలని చెప్పారు. ఓయూ విద్యార్థి నేతలు శాంతించాలన్నారు. రెచ్చిపోతే కాంగ్రెస్ కే నష్టమన్నారు. నేతలు వ్యక్తిగత దూషణలు చేసుకోవద్దని సూచించారు.
Admin