Saturday, 18 May 2024 01:11:16 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

గులాబీ పార్టీకి ‘గుర్తుల గుబులు’.. సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో బీఆర్‌ఎస్‌..

Date : 13 October 2023 12:14 PM Views : 74

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.. నవంబర్ 30 పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ ఎన్నికల సంగ్రామంలో ముందుగా అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. వ్యూహాలకు పదునుపెట్టారు. మూడో సారి అధికారాన్ని దక్కించుకుని రికార్డు సృష్టించేందుకు కేడర్‌కు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో.. గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దేందుకు సన్నాహాలను ప్రారంభించారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే.. కొంతకాలం క్రితం జరిగిన ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తు.. కారు గుర్తును పోలిన కొన్నింటికి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. కారు గుర్తుకు వేసే ఓట్లే.. అటు పోలయ్యాయని.. అలాంటి గుర్తులను ఈ ఎన్నికల్లో తొలగించాలంటూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి భారత రాష్ట్ర సమితి పార్టీ ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా.. కొన్ని ఉదహరణలను సైతం ఎన్నికల సంఘానికి అందించింది. అంతేకాకుండా.. కారు గుర్తును పోలిన ఎన్నికల గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో సైతం పిటీషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఎన్నికల గుర్తుపై ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరించుకుంది. కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించవద్దని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని BRS నిర్ణయించుకుంది. అచ్చం కారు తరహాలో ఉండే గుర్తుల వల్ల ఓటర్లు అయోమయానికి గురి అవుతున్నారని.. దీంతో ఆ గుర్తులకు ఎక్కువ ఓట్లు నమోదవుతున్నాయని బీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రోడ్ రోలర్‌, చపాతీ మేకర్‌ వంటి గుర్తుల వల్ల తమ పార్టీకి నష్టం జరిగిందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. ప్రతీ ఓటు కీలకమైన నేపథ్యంలో కారు తరహాలో ఉండే గుర్తులను కేటాయిస్తే మరోసారి నష్టం జరిగే అవకాశం వుందనేది బీఆర్‌ఎస్‌ నేతల వాదన. ఈసీ నిర్ణయంతో.. ఇప్పటికే ఈసీని కలిసి వినతపత్రం ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు.. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఎన్నికల సంఘం బృందం దృష్టికి ఇదే విషయాన్ని తీసుకెళ్లారు. అయితే, కారు తరహా గుర్తులను వచ్చే ఎన్నికల్లో వినియోగించాలని ఈసీ నిర్ణయించడంతో బీఆర్‌ఎస్‌ సుప్రీం తలుపు తట్టేందుకు రెడీ అవుతోంది. ఇదే అంశంపై గతంలో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్థాయిలో ఈ అంశంపై విచారణ జరగడంతో.. ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకుంది BRS. కారును పోలీన గుర్తులను ఇతరులకు కేటాయించవద్దని పిటిషన్‌ వేయనుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :