Saturday, 18 May 2024 10:08:44 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బంజర హిల్స్ లో దారుణం వాచ్ మెన్ ను మూడో ఫ్లోర్ నుంచి తోసేసిన డాన్సర్లు

Date : 28 April 2023 10:01 AM Views : 119

జై భీమ్ టీవీ - తెలంగాణ / : హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇంద్రనగర్‌లోని రాఘవ గెస్ట్ హౌస్ లాడ్జిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో నలుగురు డ్యాన్సర్లు వాచ్‌మెన్‌ను మూడో ఫ్లోర్ నుంచి తోసేశారు. తీవ్రంగా గాయపడిన వాచ్‌మెన్‌ యాదగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈనెల 20న షూటింగ్ నిమిత్తం చెన్నై నుంచి వచ్చిన నలుగురు డ్యాన్స్‌ర్లు రాఘవ గెస్ట్ హౌస్ లాడ్జిలో రూం బుక్ చేసుకుని ఉంటున్నారు. అయితే ఏప్రిల్ 27వ తేదీ గురువారం అర్థరాత్రి నలుగురు డ్యాన్సర్లు మద్యం మత్తులో హోటల్ సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో సిబ్బంది విషయాన్ని వాచ్‌మెన్ యాదగిరికి తెలియజేశారు. యాదగిరి వచ్చి వారిని అదుపు చేసే ప్రయత్నం చేశాడు. అయినా వినని డ్యాన్సర్లు.. యాదగిరితోనూ వాగ్వాదానికి దిగారు. ఇదే క్రమంలో డ్యాన్సర్లు యాదగిరిని మూడో ఫ్లోర్ నుంచి నెట్టివేశారు. ఈ ఘటనలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ యాదగిరి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. మని, దిన అనే ఇద్దరు డ్యాన్సర్లను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు నరేష్, నాగరాజు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం గాలిస్తున్నారు. యాదగిరి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి..కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. యాదగిరి మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని యాదగిరి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :