Saturday, 18 May 2024 11:19:44 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

అబ్బా ఏం ప్లాన్ చేశారు రా.. పోలీసులకే సినిమా చూపించారు.. పుష్ప సినిమాను మించి హైటెక్ స్మగ్లింగ్..

Date : 17 October 2023 11:21 AM Views : 74

జై భీమ్ టీవీ - తెలంగాణ / : పుష్ప సినిమా మరిపించే తరహాలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా హైటెక్ స్మగ్లర్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.. ఆ స్మగ్లర్ల ప్లాన్ చూసి షాక్ అయిన పోలీసులు వారి నుండి పెద్ద మొత్తంలో ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుండి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ ముఠా నుండి 75 లక్షల విలువగల మూడు వందల కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాదినం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన కోలి రాజా వర్మ, మహారాష్ట్రకు చెందిన పార్టిల్ నామ్‌దేవ్ ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు..రాహుల్ సబులే, శుభం గోతీరామ్ సబులే, శేషుకుమార్ అనే మరో ముగ్గురు ప్రస్తుతం పరారిలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మూడు వందల కిలోల ఎండు గంజాయిని కొనుగోలు చేశారు.. ఈ గంజాయిని రెండుకిలోల ప్యాకెట్ల రూపంలో తయారు చేసి పోలీసులకు చిక్కకుండా మాస్టర్ ప్లాన్ ఆలోచించారు..గంజాయి రవాణా కు వినియోగిస్తున్న డిసియం వ్యాన్ పై కప్పును సపరేట్ గా డిజైన్ చేసుకున్నారు. పై కప్పు పైన మరో లేయర్ ఏర్పాటు చేసుకొని ఎవరికీ అనుమానం రాకుండా అందులో గంజాయి ప్యాకెట్లను భద్ర పరిచారు. ఇంటి పై కప్పు మీద పెంకులు అమర్చినట్లుగా గంజాయి ప్యాకెట్లను అమర్చి వాటి మీద తాడిపత్రితో మూసివేసి ఈ గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నారు.. బంగారం కొనేవారికి స్వల్ప ఊరట.. ఇవాళ్టి ధరలు ఇవే.. తులం గోల్డ్ ఎంతుందంటే? అప్పటికే సుమారు ఆరు వందల కిలో మీటర్లు ప్రయాణం చేశారు.. పదులు సంఖ్యలో పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక చెక్ పోస్టులు దాటి వచ్చారు.. వరంగల్ మీదుగా మహారాష్ట్రకు చేరుకునే రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు..ఈ క్రమంలో పక్కా సమచారంతో వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల చేతికి చిక్కారు… హసన్ పర్తి మీదుగా ఈ వాహనం వెళ్తుందన్న పక్కా సమాచారంతో అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ పోలీసులు పెంచికలపేట వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ దగ్గర ఈ వాహనాన్ని పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న డిసియం వ్యాన్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వ్యాన్ రిజిస్ట్రేషన్ పత్రాల్లోని వాహనం తయారీ నంబర్ కు వాహనం ఇంజన్ పై వున్న నంబర్ కు తేడాను కూడా గుర్తించారు. నిందితుల మాస్టర్ ప్లాన్ చూసి పోలీసులే షాక్ తిన్నారు.. డీసీఎం పై భాగంలో సపరేట్ గా ఏర్పాటు చేసుకున్న తీరు చూసి అవాక్కయ్యారు.. గంజాయి తో పాటు, వాహనం సీజ్ చేసి నిందితులను రిమాండ్ కు పంపారు..

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :