Saturday, 18 May 2024 11:57:37 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

చదువుల ఒత్తిడికి మరో విద్యా కుసుమం బలి.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య!

Date : 20 October 2023 08:48 AM Views : 75

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఐఐటీ చదువుతోన్న ఓ విద్యార్ధి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోర్సులో భాగంగా సమర్పించాల్సిన ప్రాజెక్టు విషయంలో మనస్తాపానికి చెందిన విద్యార్ధి హాస్టల్‌ గదిలో ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా తూప్రాన్‌కు చెందిన కె కిరణ్‌చంద్ర (21) ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఐఐటీ చదువుతున్నాడు. కిరణ్ చంద్ర తూప్రాన్‌కు చెందిన కేతావత్‌ చందర్‌, అనిత దంపతుల కుమారుడు. అతని తండ్రి చందర్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి అనిత ఓ ప్రైవేట్‌ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది. ఈ దంపతులకు కిరణ్‌తోపాటు మరో కుమారుడు పవన్‌, కుమార్తె చైతన్య ఉన్నారు. కిరణ్‌ ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ నాలుగో ఏడాది చదువుతున్నాడు. అన్న పవన్‌ కూడా అదే కాలేజీలో ఐఐటీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. చెల్లెలు చైతన్య కొంపల్లిలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్‌ రెండో ఏడాది చదువుతోంది. ఇదిలా ఉండగా కిరణ్‌ తన హాస్టల్‌ గదిలో మంగళవారం (అక్టోబర్‌ 17) రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. తోటి విద్యార్థులు గమనించి కొన ఊపిరితో ఉన్న కిరణ్‌ను స్థానికంగా ఉన్న బీసీ రాయ్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతనికి చికిత్స అందిస్తుండగా కిరణ్‌ మృతి చెందాడు. కిరణ్‌ మృతి చెందిన విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు ఆ రాత్రే విమానంలో కాలేజీకి చేరుకున్నారు. కుమారుడి మృతదేహం పట్టుకుని గుండెలవిసేలా విలపించారు. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న కిరణ్‌కు గత నెలలో హైదరాబాద్‌లో ఆపరేషన్‌ కూడా చేయించామని.. కోలుకుని ఈ నెల 4న ఖరగ్‌పూర్‌ ఐఐటీకి వెచ్చాడని, రెండు వారాలకే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ కుమారుడి మరణం వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు పోలీసులను కోరారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :