Saturday, 18 May 2024 12:36:38 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్.. వారి ఆశలన్నీ అడియాశలేనా?!

Date : 14 October 2023 12:23 PM Views : 71

జై భీమ్ టీవీ - తెలంగాణ / : హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్‌ మొదలైంది. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను అనుసరించి అభ్యర్థుల ఎంపిక జరుగుతుందనే ప్రచారంతో ఆశావాహుల గుండెల్లో రైలు పరుగెడుతున్నాయి. ఒకటికన్నా..ఎక్కువ టిక్కెట్లు ఆశిస్తున్న వారసుల కుటుంబీకుల ఆశలపై నీళ్లు చల్లినట్లేనా..? ఇంతకీ.. ఏం జరగనుంది? ప్రత్యేక కథనం మీకోసం.. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఆశావాహుల్లో రోజుకో కొత్త టెన్షన్‌ కనిపిస్తోంది. ఇంటికి రెండు లేదా మూడు టికెట్లు కావాలంటూ కీల‌క‌నేత‌ల ప‌ట్టు ఓ ప‌క్క, బీసీల‌కు పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గానికో అసెంబ్లీ సీటు ఇవ్వాల‌న్న డిమాండ్ మ‌రో ప‌క్క, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన ఆశావ‌హుల డిమాండ్లు ఇంకో పక్క టీ కాంగ్రెస్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌పై స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌ మాట్లాడారు. ఇక ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని, మైనార్టీలు, మహిళలు, బీసీలకు తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ ప్రకారమే ఆశావాహులకు సీట్లు దక్కితే.. తమతోపాటు వారసులను రంగంలోకి దించాలని భావిస్తున్న వారి ఆశలు గల్లంతైనట్లేనా? కాంగ్రెస్‌ పార్టీలో దాదాపు 9 కుటుంబాలు వారసులు, కుటుంబసభ్యులకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి. వారిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి ఈ సారి తన ఇద్దరు కుమారులను రంగంలోకి దించారు. పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి, చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి కోసం ఆయన నాగార్జున సాగర్, మిర్యాలగూడ టికెట్లు ఆశిస్తున్నారు. సకుటుంబ సమేతంగా టికెట్లు ఆశిస్తున్న నేతల్లో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్నారు. తనతో పాటు తన సతీమణి పద్మావతిని పోటీ చేయించే పనిలో ఉన్నారాయన. తాను హుజూర్‌నగర్ నుంచి, కోదాడ నుంచి పద్మావతి కోసం అప్లై చేశారాయన. మరో సీనియర్‌ నేత దామోదర రాజనరసింహ తనతో పాటు తన కుమార్తెకూ టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా తనతో పాటు తన కుమారుడు సూర్య కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ములుగు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సీతక్క, తన కుమారుడు సూర్య కోసం పినపాక టికెట్‌ కోరుతున్నారు. మరో సీనియర్‌ నేత అంజన్‌కుమార్‌యాదవ్ తనతో పాటు తన కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్‌‌కు టికెట్లు ఇవ్వాలంటున్నారు. కొండా మురళి, కొండా సురేఖ కూడా టికెట్లు ఆశిస్తున్నారు. ఇక మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపాటి హన్మంతరావు తనకు, తన కుమారుడికి టికెట్లు ఖరారయ్యాకే కాంగ్రెస్‌ పార్టీలో చేరారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ ఉదయ్‌పూర్‌ తీర్మానం ప్రకారం ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్‌ ఇవ్వొద్దనే నిబంధన ఉంది. మరి ఈ నేతలకు, వారి కుటుంబ సభ్యులకు పార్టీ టికెట్లు ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :