Saturday, 18 May 2024 09:22:46 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మౌనిక కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించిన మేయర్

Date : 03 May 2023 02:12 PM Views : 129

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : మ్యాన్‌హోల్‌లో పడి చనిపోయిన చిన్నారి మౌనిక కుటుంబానికి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అండగా నిలిచారు. మౌనిక కుటుంబానికి జీహెచ్ఎంసీ తరపున రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ మేరకు మౌనిక కుటుంబానికి ఆమె చెక్కును అందజేశారు. తమ బిడ్డను తలుచుకుంటూ రోదిస్తున్న మౌనిక తల్లిదండ్రులను మేయర్ ఓదార్చారు. అన్నీ రకాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆమె వారికి హామీ ఇచ్చారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మౌనిక కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. మంత్రి త‌ల‌సాని మౌనిక కుటుంబ సభ్యులకు వారి నివాసంలో చెక్కును అందజేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చిన చిన్నారి మౌనిక ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్‌లో పడి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. చివరకు పార్క్ లైన్ మ్యాన్‌హోల్ వద్ద చిన్నారి మృతదేహాం లభ్యమైంది. ఈ ఘటన అందరినీ కలచివేసింది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మౌనిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :