Saturday, 18 May 2024 12:36:47 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ప్రచారంలో డోస్‌ పెంచిన గులాబీ బాస్.. కాంగ్రెస్, బీజేపీపై చెలరేగిన కేసీఆర్

Date : 19 November 2023 08:43 AM Views : 98

జై భీమ్ టీవీ - తెలంగాణ / : పోలింగ్ డేట్ దగ్గరకు వస్తుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచారు. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల స్పీచ్‌‌లో డోస్ పెంచారు సీఎం కేసీఆర్. పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అటు కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు రేవంత్‌. అసలు ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పోలింగ్‌ టైం దగ్గరపడుతుండడంతో స్పీచ్‌లో డోస్ పెంచారు గులాబీ బాస్ కేసీఆర్. ప్రచారంతో రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాలను చుట్టేస్తూ.. సూటిగా పాయింట్‌ టూ పాయింట్‌ మాట్లాడే కేసీఆర్ సెడన్‌గా చేంజ్‌ చేశారు. కేవలం చేర్యాలలో ఒక్క సభను మాత్రమే నిర్వహించారు. నాలుగు సభలకు సరిపడా డోస్ ఇచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీలపై చెలరేగిపోయారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంటూ, చంద్రబాబుకు చెంచాగిరి చేసుకునే రేవంత్‌రెడ్డి తనను తిడుతున్నాడంటూ మండిపడ్డారు. ఇది మ‌ర్యాదానా..? అంటూ ప్రశ్నించారు. తనకు పిండం పెడుతా అంట‌డు. ఎవ‌రికి పిండం పెట్టాల్నో మీరు నిర్ణయించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు కేసీఆర్. కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాను కామారెడ్డిలో నామినేషన్ వేయడాన్ని జీర్ణించుకోలేకే తనను పిచ్చి కుక్క అని తిడుతున్నారని చెప్పారు రేవంత్‌ రెడ్డి. దళితుడిని సీఎంగా చేస్తానన్న కేసీఆర్ మాట తప్పి, ఇప్పుడు కేటీఆర్‌ను సీఎంగా చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌, కేసీఆర్‌లపై విరుచుకుపడ్డారు రేవంత్‌ రెడ్డి. తన వయస్సుకు కూడా విలువ ఇవ్వకుండా.. రేవంత్‌ రెడ్డి తనను తిట్టిన విషయాలను ప్రజలతో పంచుకున్నారు కేసీఆర్. మరోవైపు తనపై కేటీఆర్, కేసీఆర్ చేస్తున్న ఆరోపణలను కామారెడ్డి ప్రజలకు వివరించారు రేవంత్ రెడ్డి. కామారెడ్డిని కాపాడేందుకే వచ్చానని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇలా ఎన్నికల ప్రచారంలో ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :