Saturday, 18 May 2024 09:22:39 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

సింగరేణి అవకతవకల విచారణపై తొలిసంతకం : రేవంత్ రెడ్డి

Date : 11 February 2023 10:51 AM Views : 183

జై భీమ్ టీవీ - తెలంగాణ / ఖమ్మం జిల్లా : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణిలో అవకతవకలపై విచారణకు ఆదేశిస్తూ తొలి సంతకం చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. సింగరేణి ఆధీనంలో ఉన్న గనులను ప్రైవేటుకు అప్పగించి 25వేల కోట్ల దోపీడికి యత్నిస్తున్నారని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయొద్దని పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీశామన్నారు. క్రిమినల్ కేసులు ఉన్న అధికారి సీఎండీగా ఉండటానికి వీల్లేదన్న రేవంత్.. రెండు మూడేళ్లు మాత్రమే ఆ స్థానంలో ఉండాల్సిన అధికారి ఏళ్లు గడుస్తున్నా సీఎండీగా కొనసాగడం దుర్మార్గమన్నారు. 10 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. సింగరేణిలో దోపిడీకి పాల్పడిన వ్యక్తులను కటకటాల్లోకి పంపిస్తామని రేవంత్ చెప్పారు. ఓపెన్ కాస్ట్ మైన్తో కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో గనికార్మికుల పాత్ర ఎంతో ఉందని.. ఒకప్పుడు 70వేలు ఉన్న ఉద్యోగులు 40వేలకు తగ్గిపోయారన్నారు. రెగ్యులర్ కార్మికులను తొలగించి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతోందని మండిపడ్డారు. అండర్ గ్రౌండ్ మైన్లు ఓపెన్ చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. కార్మికుల సమస్యలను కాంగ్రెస్ పరిష్కరిస్తుందని.. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :