Saturday, 18 May 2024 09:22:47 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నెరవేరబోతున్న దశాబ్దాల కల.. పులికాట్‌ సరస్సులో పూడికతీత పనులకు భూమిపూజ చేయనున్న సీఎం జగన్..

Date : 21 November 2023 09:19 AM Views : 85

జై భీమ్ టీవీ - తెలంగాణ / : సూళ్లూరుపేట మత్స్యకారుల దశాబ్దాల కల సాకారం కాబోతోంది. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడికతీత పనులకు..సీఎం జగన్‌ నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనులకు ప్రభుత్వం 122 కోట్ల రూపాయలను కేటాయించింది. అలాగే కాళంగి నదిపై 35 కోట్లతో చేపట్టిన నూతన బ్రిడ్జి నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులను కూడా సీఎం జగన్‌ ప్రారంభిస్తారు. దేశంలో జీవవైవిధ్యాన్ని సంతరించుకున్న రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్‌ సరస్సు. మంచినీళ్లు, ఉప్పునీళ్లు కలగలసి 45 శాతం సైలెనిటీ కలిగి ఉండడంతో ఇక్కడ మత్స్యసంపద సమృద్ధిగా దొరికేది. పులికాట్ మొత్తం విస్తీర్ణం 640 చదరపు కిలోమీటర్లు కాగా అందులో 84 శాతం ఏపీలోనూ, 16 శాతం తమిళనాడులోను ఉంది. అయితే భూభాగం ఏపీలో అధికంగా ఉన్నా.. నీటి శాతం మాత్రం తమిళనాడులో ఎక్కువగా ఉంది. అయితే పూడిక కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా సముద్రం నుంచి ఉప్పునీరు రావడం తగ్గిపోవడంతో.. మత్స్య సంపద కూడా తగ్గుతూ వస్తోంది. గత పదేళ్లతో పోల్చుకుంటే సరస్సులో మత్స్యసంపద బాగా తగ్గింది. అయితే, తమిళనాడు తీరంలో ఉండే ముఖద్వారాల్లో అక్కడి ప్రభుత్వం ఏటా పూడిక తీయిస్తోంది. దీంతో అక్కడ నీటి సామర్ధ్యం ఉంటోంది. కానీ ఏపీలో మాత్రం పూడికతీత పనులు జరగడం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇదొక ఎన్నికల ప్రచారాస్త్రంగా మారుతోందే తప్ప..పరిష్కారం మాత్రం లేదు. దీనిపై టీవీ9 అనేక కథనాలను కూడా ప్రసారం చేసింది. గత ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూడిక తీత చేపడతామని గతంలో జగన్‌ హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పుడు ఆచరణలోకి రాబోతోంది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ముఖద్వారాల పూడిక తీత పూర్తయితే రాష్ట్ర ప్రరిధిలోని పులికాట్ భూభాగంలో నీరు పుష్కలంగా ఉంటుంది. తద్వారా మత్స్య సంపద పెరిగి..మత్స్యకార కుటుంబాలకు ఉపాధి పెరుగుతుంది. అలాగే పులికాట్‌ సరస్సు ఎల్లప్పుడూ జలంతో కళకళలాడుతూ ఈ ప్రాంత పక్షుల భూతల స్వర్గంగా విరాజిల్లే అవకాశం ఉంది. తద్వారా ఈ ప్రాంతం పర్యాటకపరంగా కూడా అభివృద్ధి చెందుతుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :