Saturday, 18 May 2024 11:19:42 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Rajagopal Reddy: పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైలమా.. బుజ్జగించేందుకు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా నియామకం

Date : 05 October 2023 09:19 PM Views : 71

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ ఇమేజే వేరు. అందులోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టైలే వేరు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ పై కొట్లాడారు. చివరకు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉపఎన్నికలో హోరాహోరీ పోటీ ఇచ్చిన రాజ్ గోపాల్ చివరకు ఓటమి పాలయ్యారు. ఇదంతా ఒక వైపైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి.. Rajagopal Reddy: పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైలమా.. బుజ్జగించేందుకు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా నియామకం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికతో బీజేపీ గూటికి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమల దళంలో సంతృప్తిగా లేరా..? జాతీయ స్థాయి కమిటీలో స్థానంతో పాటు తాజాగా ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా స్థానం కల్పించినా నిమ్మకుండడంలో ఆంతర్యమేంటి..? తిరిగి సొంత గూటికి వస్తున్నారా..? పార్టీ మార్పు ఆలోచనతో మళ్ళీ క్యాడర్ డైలమాలో పడ్డారా…? ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ ఇమేజే వేరు. అందులోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టైలే వేరు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ పై కొట్లాడారు. చివరకు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉపఎన్నికలో హోరాహోరీ పోటీ ఇచ్చిన రాజ్ గోపాల్ చివరకు ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అనే వేవ్ రావడంతో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలోనే రాజ్ గోపాల్ రెడ్డి సైతం పునరాలోచనలో పడ్డారట. త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటానని ఆయనే వెల్లడించడంతో చర్చ మొదలైంది. బీజేపీ పెద్దలు జాతీయ స్థాయి కమిటీలో రాజ్ గోపాల్ రెడ్డికి అవకాశం కల్పించారు. కొంతకాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో సైలెంట్ గా ఉన్నారు. ఇటీవల ప్రధాని మోడీ బీజేపీ బహిరంగ సభలకు రాజ్ గోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు. ప్రధాని మోడీ పాల్గొన్న రెండు సభలకూ రాజ్ గోపాల్ రెడ్డి డుమ్మా కొట్టడంతో ఆయన పార్టీ మార్పు ఆలోచనతో ఉన్నట్లుగా సంకేతాలు ఇచ్చినట్లయింది. ఇప్పటికే నియోజక వర్గంలోని ముఖ్య అనుచరులతో పార్టీ మార్పుపై అభిప్రాయం తీసుకున్నట్టు సమాచారం. నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకుందామని క్యాడర్ కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలా ఉంటుందనే దానిపై తీవ్రంగా తర్జనభజన పడుతున్నారట. అయితే రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాలతో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రాజ్ గోపాల్ రెడ్డికి అడ్డంకిగా ఉన్నా.. నకిరేకల్ నియోజక వర్గం రూపంలో లైన్ క్లియర్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరికను ముందు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డి నుండి వీరేశంకు సహాకారం ఉండడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసేదేమి లేక వీరేశం చేరికను స్వాగతించారు. అయితే వీరేశం చేరికతోనే వెంకట్ రెడ్డి సోదరుడు రాజ్ గోపాల్ రెడ్డి రీ ఎంట్రీకి లైన్ క్లియర్ అయ్యిందట. నకిరేకల్ కాంగ్రెస్ పార్టీలో వీరేశం చేరికకు తాను అభ్యంతరం చెప్పకుండడం.. రాజ్ గోపాల్ రెడ్డి మునుగోడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రేవంత్ రెడ్డి అడ్డుకోవడం లాంటివి ఉండకుండా రేవంత్, వెంకట్ రెడ్డిలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మరోపక్క తాను రాజీనామా చేయడంతో జరిగిన అభివృద్ధిని గెలుపుగా మార్చుకోవాలంటే బీజేపీలో కొనసాగాలా.. వద్దా అనేది తెల్చుకోలేక డైలమాలో ఉండడంతో బీజేపీ క్యాడర్ కన్ఫ్యూజన్ లో ఉందట. అయితే మోడీ సభలకు డుమ్మా కొట్టడం చూస్తే ఇక బీజేపీకి గుడ్ బై చెప్పడం ఖాయమేనని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు తాజాగా ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా పార్టీ నియమించింది. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వైఖరి ఎలా ఉండబోతుందోనన్న చర్చ ఆసక్తికరంగా మారింది. మొత్తానికి రాజ్ గోపాల్ రెడ్డి అనుసరిస్తున్న తీరుతో పార్టీ మార్పు ఖాయం అన్న ప్రచారం నియోజక వర్గంలో జోరుగా సాగుతుంది. మరి రాజ్ గోపాల్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :